Tollywood Movies : ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. స్టార్ హీరోలు అందరు కూడా తమ సినిమాలను అన్ని భాషల్లోని అభిమానులు చూడాలని భావిస్తుంటారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానిపై అంచనాలు కూడా ఓ రేంజ్ లోనే ఉంటాయి. గతంలో 1000 కోట్లు, 1500 కోట్లు వరకు సినిమాలో ప్రపంచవ్యాప్తంగా వసూలను కలెక్ట్ చేశాయి. ఇప్పుడు టార్గెట్ మారింది. 2000 కోట్ల క్లబ్ లోకి ఏ హీరో చేరుకుంటాడా అని ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది. మరి ఇప్పుడు రాబోతున్న స్టార్ హీరోల సినిమాలకు 2000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతారా? ఏ హీరో సినిమా అన్ని కోట్లను వసూల్ చేస్తుందో చూసేద్దాం..
టాలీవుడ్ స్టార్ హీరోల భారీ ప్రాజెక్టు..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలే తెరకెక్కుతున్నాయి.. అందులో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ 1000 కోట్లతో నిర్మిస్తుండటం విశేషం.. రాజమౌళి నుంచి వస్తున్న సినిమాలంటే చాలు జనాలు చెవులు కోసుకుంటారు. మరి రిలీజ్ అయ్యాక ఈ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..
అల్లు అర్జున్ – తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న మూవీని హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా సై-ఫై ఫిల్మ్ రూపుదిద్దుకుంటుండటం విశేషం. సన్ పిక్చర్స్ సంస్థ రూ.800 కోట్లతో నిర్మిస్తోంది. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.
బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు. కల్కి మూవీతో మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రూ.500 కోట్లకు పైగానే బడ్జెట్ ను కలిగి ఉంటుందని అంచనా..
రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో పెద్ది మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. రూ.300 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపైనా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి..
Also Read: హేమ చంద్ర అంత టార్చర్ చేశాడా..? శ్రావణ భార్గవి షాకింగ్ పోస్ట్..!
2 వేల టార్గెట్ కోసం టాలీవుడ్ స్టార్స్ పోటీ..
1000 కోట్లు కలెక్షన్స్ ని దాటిన సినిమాలు బోలెడు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు రెండు వేల కోట్లు వరకు వసూలు చేసిన సినిమాలు తెలుగులో ఒక్కటి కూడా లేదు. దాంతో ప్రస్తుతం రాబోతున్న స్టార్ హీరోల సినిమాలపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 2200 కోట్లకు పైగా వసూలు చేసిన దంగల్ మూవీ రికార్డుని తమ అభిమాన హీరో సినిమా క్రాస్ చెయ్యాలని కోరుకుంటున్నారు.. పుష్ప2 తో అల్లు అర్జున్ ఆ దిశగా ప్రయాణించారు. కేవలం రూ.1800 కోట్ల గ్రాస్ వసూళ్లకే పరిమితం అయ్యారు. ఇక నెక్ట్స్ అల్లు – అట్లీ ప్రాజెక్ట్ తోనైనా ఈ టార్గెట్ ను బ్రేక్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అదే విధంగా కల్కి 2898AD మూవీకి గతంలో మంచి రెస్పాన్స్ దక్కింది. మహాభారతం స్టోరీ ఆధారంగా దొరికిన ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్2 రాబోతుంది. స్టోరీ మొత్తం ఆ మూవీలోని చూపించబోతున్నాడు డైరెక్టర్. అందుకే ఈ సినిమాకు రెండు వేల కోట్లకు పైగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. జక్కన్న మహేశ్ బాబుతో 2000 గ్రాస్ వసూళ్లు అవలీలగా సాధిస్తారని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ ఏడాది ఏ సినిమా రెండు వేల కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి..