BigTV English

OTT Movie : తుడిచి పెట్టేసే సునామీ, బిల్డింగులను మింగేసే భూమి… ఆ ఒక్క ఫ్యామిలీ ఎస్కేప్… రాక్ మామ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : తుడిచి పెట్టేసే సునామీ, బిల్డింగులను మింగేసే భూమి… ఆ ఒక్క ఫ్యామిలీ ఎస్కేప్… రాక్ మామ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : విపత్తుల ఆధారంగా తెరకెక్కే సినిమాలు ఉత్కంఠభరితంగా నడుస్తుంటాయి. ఇటువంటి సినిమాలు అరాచకమైన సన్నివేశాలతోనే నడుస్తాయి. ఇప్పుడుమనం చెప్పుకోబోయే సినిమా భూకంపం, సునామీలతో పిచ్చెక్కిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే.


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ యాక్షన్ మూవీ పేరు ‘San Andreas’. 2015 లో వచ్చిన ఈ సినిమాకి బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ద్వేన్ జాన్సన్ (రేమండ్ “రే” గెయిన్స్), కార్లా గుగినో (ఎమ్మా గెయిన్స్), అలెగ్జాండ్రా డాడ్డారియో (బ్లేక్ గెయిన్స్), ఇయాన్ గ్రఫుడ్ (డానియల్ రిడ్డిక్), మరియు పాల్ జియామట్టి (లారెన్స్ హేయ్స్) నటించారు. ఈ చిత్రం కాలిఫోర్నియాలోని శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‌లో సంభవించిన భారీ భూకంపం చుట్టూ తిరుగుతుంది. ఒక రెస్క్యూ పైలట్ భారీ విధ్వంసం మధ్య తన కుటుంబాన్ని రక్షించడానికి ప్రాణాలకు తెగించి పోరాడతాడు. 1 గంట 54 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈసినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

రే అనే వ్యక్తి లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో హెలికాప్టర్ రెస్క్యూ పైలట్‌గా పని చేస్తుంటాడు. అతను అనేక రెస్క్యూ మిషన్‌లలో అనుభవజ్ఞుడు. అతను తన భార్య ఎమ్మా తో విడాకుల కోసం ప్రయత్నిస్తుంటాడు. ఎమ్మా ఒక సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ డానియల్ రిడ్డిక్ తో, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్దపడుతూ ఉంటుంది. వారి 19 ఏళ్ల కుమార్తె బ్లేక్ తన తల్లితో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. కానీ రే ఆమెతో సమయం గడపడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో, కాల్టెక్ సీస్మాలజిస్ట్ డాక్టర్ లారెన్స్ హేయ్స్ అతని సహోద్యోగి డాక్టర్ కిమ్ పార్క్ హూవర్ డ్యామ్‌లో ఒక కొత్త భూకంప హెచ్చరిక సిస్టమ్‌ను పరీక్షిస్తుంటారు. అక్కడ 7.1 తీవ్రతతో భూకంపం సంభవిస్తుంది. దీని వల్ల డ్యామ్‌ ధ్వంసం అవుతుంది. డాక్టర్ కిమ్‌ కూడా చనిపోతాడు. మరో వైపు శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‌లో ఒక భారీ భూకంపం రాబోతుందని లారెన్స్ హెచ్చరిస్తాడు.

అతను చెప్పినట్లే 9.1 తీవ్రత భూకంపం లాస్ ఏంజిల్స్‌లో వస్తుంది. రే తన హెలికాప్టర్‌లో ఎమ్మాను ఒక ఆకాశహర్మ్యం టెర్రస్ నుండి రక్షిస్తాడు. అక్కడ ఆమె డానియల్‌తో ఉంటుంది. అక్కడ భయంతో డానియల్, ఎమ్మాను వదిలేసి పారిపోతాడు. ఆమె పట్ల అతని బుద్ది బయటపడుతుంది. ఇప్పుడు రే, ఎమ్మా, బ్లేక్‌ను కాపాడటానికి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తారు. కానీ వారి హెలికాప్టర్ ఒక గ్యాస్ లీక్ వల్ల క్రాష్ అవుతుంది. వారిని బేకర్స్‌ఫీల్డ్‌లో చిక్కుకునేలా చేస్తుంది. అక్కడ వాళ్ళు ఒక వృద్ధ దంపతుల నుండి కారును దొంగలిస్తారు. శాన్ ఫ్రాన్సిస్కోలో, బ్లేక్ డానియల్‌తో ఉంటుంది. అతను ఆమెను ఒక పార్కింగ్ గ్యారేజ్‌లో వదిలేయడంతో, ఆమె సమస్యల్లో చిక్కుకుంటుంది. ఇంతలో లారెన్స్ ఒక 9.6 తీవ్రత భూకంపం శాన్ ఫ్రాన్సిస్కోను తాకుతుందని, దాని తర్వాత సునామీ రాబోతుందని హెచ్చరిస్తాడు. రే, ఎమ్మా ఒక పడవలో, శాన్ ఫ్రాన్సిస్కో బేకి చేరుకుంటారు. అక్కడ సునామీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌ను ధ్వంసం చేస్తుంది. ఇక అక్కడ ఒక ఒక భయాంకరనైనా వాతవరణం ఏర్పడుతుంది. చివరికి రే తన కూతుర్ని కాపాడుకుంటాడా ? ఈ ప్రమాదాలు ఎలాంటి వినాశనాన్ని తెస్తాయి ? రే, ఎమ్మా మళ్ళీ కలసి జీవిస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కొత్త కోడలు అడుగు పెట్టినప్పటి నుంచి అపశకునాలే… ట్విస్టులతో అదరగొట్టే కన్నడ మిస్టరీ థ్రిల్లర్

Related News

HHVM OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు… ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : శవంపై కోరిక… ఏకంగా బాయ్ ఫ్రెండ్ ముందే దాంతో ఆ పని… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమా మావా

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

×