OTT Movie : మనిషి ఎదగడానికి ఎన్నో దారులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక అమ్మాయి ఎంచుకునే దారి వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. తను పేదరికం నుంచి సెలఎబ్రిటీలను డీల్ చేసే వరకూ వెళ్తుంది. ఆ తరువాత స్టోరీ అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇందులో అలాంటి సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల దీనిని ఒంటరిగా చూడటమే మంచిది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘గర్ల్స్ టు బై’ (Girls to Buy). 2021 లో వచ్చిన ఈ సినిమాకి మరియా సడోవ్స్కా దర్శకత్వం వహించారు. పోలిష్ రచయిత పియోటర్ క్రిసియాక్ 2018 లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం దుబాయ్‌లో హై-ఎండ్ ఎస్కార్ట్ సర్వీసెస్‌లో చిక్కుకున్న పోలిష్ సెలెబ్రిటీలు, మోడల్స్ చుట్టూ తిరిగే నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఎమీ అనే అమ్మాయి, పోలాండ్‌లోని ఒక చిన్న పట్టణంలో తన తల్లితో జీవిస్తుంటుంది. పేదరికంతో విసిగిపోయిన ఎమీ, తన అందాన్ని ఉపయోగించి, తన కోరికలను సాధించడం అలవాటు చేసుకుంటుంది. ఒక రోజు ఆమె డొరోటా, ఆమె కుమార్తె మరియాన్నా అనే తల్లి-కూతుర్లను కలుస్తుంది. వాళ్ళు ఆమెను హై-ఎండ్ ఎస్కార్ట్ గ్లామరస్ ప్రపంచంలోకి పరిచయం చేస్తారు. ఈ అవకాశాన్ని ఎమీ ఆలోచించకుండా ఒప్పుకుంటుంది. త్వరలోనే మిడిల్ ఈస్ట్‌లో, ముఖ్యంగా దుబాయ్‌లో, ఎక్స్‌క్లూజివ్ ఎస్కార్ట్‌గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమె తన అందం, తెలివి, ఆకర్షణతో ఈ రంగంలో త్వరగా ఎదుగుతుంది. అరబ్ షేక్‌ల ఆహ్వానంతో, ఎమీ తన సొంత VIP ఎస్కార్ట్ సర్వీస్‌ను ప్రారంభిస్తుంది. పోలిష్ సెలెబ్రిటీలు, నటీమణులు, మోడల్స్‌ను రిక్రూట్ చేస్తుంది.
ఆమె శామ్ అనే ఒక ఫిక్సర్‌తో కలిసి పనిచేస్తుంది. అతను ధనవంతులైన అరబ్ క్లయింట్‌ల కోసం ఈవెంట్ లను ఏర్పాటు చేస్తాడు. ఈ లగ్జరీ ప్రపంచం కాన్స్, దుబాయ్, ఇతర గ్లామరస్ లొకేషన్స్‌లో జరిగే పార్టీలు, యాచ్‌లు, ఖరీదైన హోటళ్లతో నిండి ఉంటుంది. ఎమీ ఈ జీవనశైలిలో మునిగిపోతుంది. ఒక సాధారణ వ్యక్తి సంవత్సరంలో సంపాదించే డబ్బును ఒక నెలలో సంపాదిస్తుంది. ఆమె బార్టోక్ అనే ధనవంతుడైన ఈక్వెస్ట్రియన్‌తో సన్నిహిత సంబంధాన్ని కూడా పెట్టుకుంటుంది. అయితే ఈ గ్లామరస్ ప్రపంచం త్వరలోనే తన చీకటి వైపును చూపిస్తుంది. ఎమీ రిక్రూట్ చేసిన కొందరు అమ్మాయిలు, ఈ అండర్‌గ్రౌండ్ ట్రేడ్‌లో బాధితులుగా మారతారు. ఆ తరువాత ఎమీ అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. చివరికి ఎమీ ఇదే లైఫ్ ని కంటిన్యూ చేస్తుందా ? దీని నుంచి బయట పడుతుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : మత్తెక్కించే అందంతో మగాళ్లకు వల వేసే డీమాన్… చొంగ కార్చారో డైరెక్ట్ నరకానికి టికెట్