E-Paper
Advertisement

మోదీకి చుక్కలు చూపిస్తోన్న రాహుల్.. విదేశీ గడ్డపై నుంచి మరో డేంజరస్ కామెంట్!

మోదీకి చుక్కలు చూపిస్తోన్న రాహుల్.. విదేశీ గడ్డపై నుంచి మరో డేంజరస్ కామెంట్!
Advertisement

Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కొలంబియా యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత దేశ ఆర్ధిక స్థితి గతులపైనా యువతలో పేరుకుపోతోన్న అసంతృప్తిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ప్రభుత్వంలో ఉన్న వారు మీడియాలూ ఆర్ధిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పకపోయినప్పటికీ తీవ్ర ఆర్ధిక సంక్షోభం ముంగిట భారత్ ఉందనేది భయంకరమైన వాస్తవమని రాహుల్ గాంధీ అన్నారు. భారత విద్యార్ధులకు దేశంలో భవిష్యత్తుపై ఎలాంటి నమ్మకం లేదు.నిరుద్యోగం, పరిమిత ఉపాధి అవకాశాలు, విద్యావిధానంలో లోపాలతో యువత తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తమ తల్లి దండ్రులు తాత ముత్తాల మాదిరిగా ఉద్యోగాలు లేకుండా ఉండడానికి నేటి తరం యువత సిద్ధంగా లేదని రాహుల్ వివరించారు.

ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిందే

Advertisement

దేశంలో కొంతకాలంగా ఓటు చోరీకి వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలను సైతం రాహుల్ గాంధీ ప్రస్తావించారు. భారత్ లో అధికారంలో ఉన్న బిజెపి ఎన్నికల కమిషన్ అండతోనే ఓట్ చోరీకి తెగబడిందని రాహుల్ తీవ్రమైన విమర్శ చేశారు. 2024 ఎన్నికల్లో పోలైన ఓట్లలో 14 కోట్లకు పైగా ఓట్లు ఇపుడు ఓటర్ల జాబితా నుంచి తొలగించేశారని రాహుల్ అన్నారు. అవి చెల్లని ఓట్లు అయితే.. ఆ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎలా చెల్లుబాటు అవుతుందని రాహుల్ గాంధీ నిలదీశారు. గత ఎన్నికలు ఎలా చెల్లుబాటు అవుతాయని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు రాహుల్ గాంధీ. దీన్ని సరిదద్దాలంటే ఎన్నికల వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ అభిప్రాయ పడ్డారు. ఓటు చోరీ జరిగిందనడానికి తమ వద్ద ఆదారాలు ఉన్నాయని రాహుల్ అన్నారు. ఎన్నికల కమిషన్ లోని కీలక అధికారులే ఈ సమాచారం ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వానికి భయపడి ఆ అధికారులు బయటకు రావడం లేదని యువత మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోందని రాహుల్ పేర్కొన్నారు.

బిజేపీ మంత్రులపై రాహుల్ గాంధీ ఫైర్..

Advertisement

విదేశీ గడ్డపై నుంచి భారత్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారంటూ గతంలోనూ రాహుల్ గాంధీపై బిజెపి మంత్రులు విరుచుకు పడ్డారు. అయితే గతంలో ప్రధాని మోదీ సైతం అమెరికా గడ్డపైనుంచి తాను ప్రధాని అయ్యే వరకు భారత దేశంలో అభివృద్ధే జరగలేదన్నట్లు మాట్లాడ్డం మాజీ ప్రధానులను అవమానించడం కాదా అప్పడు దేశ ప్రతిష్ఠకు భంగం కలగలేదా అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. రాహుల్ తాజా వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

Also Read: ఆరు నెలలకే ప్రపంచ రికార్డు.. బుడిబుడి అడుగుల్లో బుల్లి సంచలనం!

Tags

Related News

లిఫ్టులు, ఎస్కలేటర్లపై కొత్త రూల్స్.. ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. రాష్ట్రంలో అందరూ పాటించాల్సిందే!

ఈ రైతు ‘లాటరీ’ పండిందోచ్.. రూ.500 టికెట్‌పై ఏకంగా రూ.12 కోట్ల జాక్ పాట్.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర!

మసీదులో నక్కినా తప్పని చావు.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఖతం.. ఇది కదా రివేంజ్ అంటే!

ఒక మహిళ వీలునామా రాయకుండానే చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది? చట్టం ఏం చెబుతోందంటే

CNG ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కలకలం.. తెల్లని పొగ మాదిరిగా ఆ ప్రాంతమంతా, భయంతో స్థానికులు పరుగులు

రహస్యంగా రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణలు సాక్ష్యంగా చెల్లుతాయా? విడాకుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇదే

మధురై తనిష్క్ దోపిడీ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితుడు అరెస్ట్, 11.7 కిలోల బంగారం రికవరీ

Big Stories

Advertisement
×