Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అప్పుడే 9 వారాలు పూర్తయింది. ప్రస్తుతం పదో వారంలో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్స్ సన్నిహితులు,కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ లో జోష్ నింపుతున్నారు. అంతేకాదు ఆట గట్టిగా ఆడాలి అని సలహా ఇస్తున్నారు. ఇకపోతే ఫ్యామిలీ వీక్ లో ఒకవైపు కంటెస్టెంట్స్ సంతోషంలో మునిగి తేలుతుంటే.. మరొకవైపు నామినేషన్ లిస్ట్ తో పాటు ఎలిమినేషన్ దిశగా అడుగులు వేస్తున్న వారి వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో పదో వారానికి టెంపర్ వంశీ (Tempar Vamshi) హౌస్ కెప్టెన్ గా సేఫ్ జోన్ లో నిలవగా.. 12 మంది పోటీదారులు ఈసారి నామినేట్ చేయబడ్డారు. మరి నామినేషన్ లో ఉన్న ఆ 12 మంది పోటీదారులు ఎవరు? అనే విషయానికి వస్తే.. త్రిగుణ్, ముఖేష్, శివకుమార్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి, అమన్, వర్షిణి సౌందరరాజన్, నీతూ నటరాజ్, శ్వేతా నాయుడు, దెబ్జానీ, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్ ఇలా మొత్తం 12 మంది ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు.
గతవారం దీపావళి సందర్భంగా ఎవరిని ఎలిమినేట్ చేయడం లేదని చెబుతూనే.. కంటెస్టెంట్స్ కి ఎలాంటి మినహాయింపులు ఉండవని నాగార్జున (Nagarjuna)హెచ్చరించారు. అనుకున్నట్లుగానే పదవ వారం నామినేషన్ లో కంటెస్టెంట్లకు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. పైగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఈ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుండి బయటకు వెళ్లిపోయే ఆ ఇద్దరు ఎవరో ఎప్పుడు చూద్దాం…
also read:బుల్లితెర జంట ఇంట్లో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే?
పదోవారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎప్పటిలాగే ముఖేష్, త్రిగుణ్ నువ్వా? నేనా? అన్నట్టుగా టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. ఆశ్చర్యంగా కొన్ని అన్ అఫీషియల్ పోల్స్ లో ముఖేష్ టాప్ లో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. దీనికి కారణం రోహిత్ ఎలిమినేట్ కావడంతో.. అతని ఫాన్స్ అందరు కూడా ముఖేష్ కు ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖేష్ టాప్ లో దూసుకుపోతున్నారు. రెండవ స్థానంలో త్రిగుణ్ ఉండగా.. మూడవ స్థానంలో దేబ్జానీ, నాలుగో స్థానంలో అమన్, ఐదవ స్థానంలో జబర్దస్త్ నరేష్, ఆరవ స్థానంలో రామ్ ప్రసాద్ ఉన్నారు. మిగతా స్థానాలలో సుధీర్, శ్వేత, శివకుమార్, వర్షిణి , నీతూ మాస్టర్ అన్నారు.
ఇకపోతే గతవారం ఎలిమినేషన్ నుండి తృటిలో తప్పించుకున్నారు శివకుమార్, సుధీర్ , నీతూ మాస్టర్. ప్రస్తుతం వీరంతా కూడా నామినేషన్ లో ఉన్నారు. ముఖ్యంగా నీతూ మాస్టర్ అలాగే సుధీర్ ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఓటింగ్ కి టైం ఉంది కాబట్టి ఎలిమినేషన్ లో ఏదైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఓటింగ్ ఇలాగే కొనసాగితే మాత్రం నీతూ మాస్టర్, సుధీర్ ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లడం ఖాయంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో త్రిగుణ్ ను కెలికితే హౌస్ విడాల్సిందేనా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.