Vishwadev Rachakonda:విశ్వదేవ్ రాచకొండ..ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 35 చిన్న కథ కాదు సినిమాతో ఒక్కసారి లైమ్ లోకి వచ్చేశాడు.అయితే ఒకవైపు నటుడిగా మంచి సినిమాలు చేస్తూనే సరికొత్త కాన్సెప్ట్స్‌తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో తాజాగా ఓక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వదేవ్ తను నిర్మాతగా మారడానికి గల కారణాలతో పాటు, 35 చిన్న కథ కాదు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.
మాములుగా హీరోలు కెరీర్‌లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత నిర్మాతలుగా మారుతారన్న సంగతి తెల్సిందే.అయితే విశ్వదేవ్ మాత్రం నిర్మాతగా మారడం వెనుక మరో ఆలోచన ఉందని తనకు వచ్చే కథల్లో కొన్ని నచ్చకపోతే వాటిని వదిలేసుకుంటున్నానని, మరికొన్ని కథలు బాగా నచ్చినప్పటికీ వాటిని నిర్మించడానికి ఇతరులు ముందుకు రాకపోతే తానే ప్రొడ్యూసర్ గా అడుగు వేస్తున్నానని చెప్పాడు. తాను పెద్ద స్టార్ యాక్టర్‌ను కాదని, తనకు నచ్చిన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఇష్టంతోనే ఇలా చేస్తున్నాని చెప్పుకొచ్చాడు.
ఇక సినిమా నిర్మించడం అనేది కేవలం డబ్బులు పెట్టి సినిమా తీయడం మాత్రమే కాదని, ఒక మంచి కథను నలుగురికి పరిచయం చేయాలనే ఆలోచన కూడా అందులో ఉంటుందని విశ్వదేవ్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తనకు నచ్చిన కథను ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే ఎలా అయినా ఆ సినిమాను పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నానని అసలు విషయం చెప్పుకొచ్చాడు. తాను చేసే సినిమాలు కూడా నిర్మాతలు రెగ్యలర్ గా చేసేలా ఉండవని, ఒక కథ నచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలనే నిర్మాణంలోకి వస్తున్నానని చెప్పారు.
ఇక ఇదే క్రమంలో ’35 చిన్న కథ కాదు’ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా చేయాలనుకున్న సమయంలో దాన్ని ఎలా తీయాలనే విషయంలో అసలు క్లారిటీ లేదని ఆ తర్వాత సృజన్ ఈ జర్నీలోకి వచ్చాడని,ఆ క్రమంలోనే తాను కూడా నిర్మాణంలోకి వచ్చామని చెప్పాడు. ఇక ఈ సినిమా జరగడానికి రానా దగ్గుబాటి అందించిన సపోర్ట్ మాములుది కాదని, ఒక కథ నచ్చినప్పుడు దాని చుట్టూ నలుగురైదుగురు కలిసి ఒక యూనిట్ గా మారి సాధ్యమైన విధంగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపాడు.
’35 చిన్న కథ కాదు’ సినిమా విషయానికి వస్తేనివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించగా,పిల్లల ప్రపంచం, చదువు, జీవితంలోని చిన్న చిన్న విషయాలను చక్కగా చూపించిన ఈ సినిమా నేషనల్ అవార్డుని దక్కించుకున్న సంగతి తెల్సిందే.
ఇలాంటి కథలు ప్రేక్షకుల ముందుకు రావాలంటే కొత్త ఆలోచనలతో పాటు వాటిని నమ్మి ముందుకు తీసుకెళ్లే నిర్మాతలు కూడా అవసరమని చెప్పుకొచ్చాడు విశ్వదేవ్ .ఇక తాను నిర్మాతగా మారింది తనలోని నటుడిని మాత్రమే ఎంకరేజ్ చేసుకోవడానికి కాదని మంచి కథలను వెలుగులోకి తీసుకురావడమే తన అసలు ఉద్దేశమని స్పష్టం చేశాడు. ఒక కథ ఎవరో ఒకరి మనసులో పుడుతుందని, ఆ కథను తెరపైకి తీసుకురావడం ద్వారా దాని వెనుక ఉన్న ఆలోచన మరింత మందికి చేరుతుందంటూ మనసులోని మాటలని బయట పెట్టాడు ఈ యంగ్ హీరో !
also read:స్టార్ సింగర్స్‌తో శార్వరి సందడి.. ఈ బ్యూటీ ఎనర్జీ మామూలుగా లేదుగా!