E-Paper
Advertisement

స్టార్ సింగర్స్‌తో శార్వరి సందడి.. ఈ బ్యూటీ ఎనర్జీ మామూలుగా లేదుగా!

స్టార్ సింగర్స్‌తో శార్వరి సందడి.. ఈ బ్యూటీ ఎనర్జీ మామూలుగా లేదుగా!
Advertisement

Sharvari Wagh:శార్వరి వాఘ్..బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ యంగ్ హీరోయిన్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూ కనిపిస్తూ, తనదైన స్టైల్‌తో నెటిజన్లని తనవైపు తిప్పేసుకుంటుంది. ముఖ్యంగా ఆమె వేసుకున్న పీచ్ కలర్ డ్రెస్, దానిపై ఉన్న గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫోటోలకు మెయిన్ ఎసెట్ గా నిలిచాయనడంలో సందేహం లేదు.

ఇక ఈ ఫోటోలకు శార్వరి ఇచ్చిన క్యాప్షన్ కూడా క్రేజీ ఉందనే చెప్పాలి “ప్రముఖుల మధ్య, మధురమైన సంగీతం నడుమ ప్రమోషన్స్‌లో పాటలు పాడుతూ ముందుకు సాగుతున్నాం.. నా విషయంలో మాత్రం డ్యాన్స్ చేస్తున్నా” అంటూ సరదాగా పోస్ట్ పెట్టడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.దీన్ని బట్టి ప్రస్తుతం శార్వరి చేస్తున్న సినిమా ప్రమోషన్స్ ఎంత సందడిగా సాగుతున్నాయో అర్థమవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంగీతం, పాటలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఈ బ్యూటీ ఇపుడు తన సోషల్ మీడియా పోస్టులతోనూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుందన్న మాట.

Advertisement

ప్రస్తుతం శార్వరి వాఘ్ సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యే ప్రేమ్ మోల్ లియా’ (Yeh Prem Mol Liya)లో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగానటిస్తుందన్న సంగతి తెల్సిందే.రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ముఖ్యంగా సూరజ్ బర్జాత్యా సినిమాలంటే కుటుంబ విలువలకి పెట్టింది పేరు. గతంలో ఆయన తెరకెక్కించిన ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘వివాహ్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి సినిమాలు ఆడియన్స్ ని ఎలా అలరించాయో చెప్పక్కర్లేదు.

ఇప్పుడు అదే క్రమంలో మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుండటంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్.ఇక ఈ సినిమాకు హిమేష్ రేషమ్మియా సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్, ‘జై అంబే బోల్’, ‘జుమ్కా పటోలా’, ‘సావన్ ఆయా హై’ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేశాయి కూడా.

Advertisement

ఇక శార్వరి సినిమాల విషయానికి వస్తే .’బంటీ ఔర్ బబ్లీ 2′ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ‘ముంజ్యా’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించేసింది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సౌండ్ చేసిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ‘మహారాజ్’, ‘వేదా’ సినిమాలతో తనలోని మరో యాంగిల్ ని బయట పెట్టి ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చింది.

ఇక ఈ మధ్యే వచ్చిన ‘ఆల్ఫా’ సినిమాలోనూ అలరించినశార్వరి, ఇంతియాజ్ అలీ దర్శకత్వంలోవచ్చిన ‘మైనే వాపస్ ఆవూంగా’తోనూ పలకరించడం విశేషం. మొత్తంగా ‘యే ప్రేమ్ మోల్ లియా’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న శార్వరి, తన లేటెస్ట్ ఫోటోషూట్స్, డ్యాన్స్ వీడియోలు, సినిమా అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలోనూ మంచి సందడి చేస్తుందన్న మాట !

ALSO READ :ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

Tags

Related News

గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. రెండు రోజుల పాటు గ్రాండ్ సెలబ్రేషన్స్!

రావణాసురుడిగా యష్.. కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలుసా? నిజంగా గ్రేట్ అంటూ!

టిల్లూ స్కెచ్ మామూలుగా లేదుగా.. ఏకంగా సుకుమార్ తో !

ధనుష్‌కు కలిసిరాని బాక్సాఫీస్..200 కోట్ల బడ్జెట్ అవసరమా ?

హైంధవ డైరెక్టర్ పై జేడీ ఫైర్.. ఛాన్స్ ఇచ్చినోడికే దెబ్బలా?

దిశా అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?

Big Stories

Advertisement
×