Tollywood Directors : తెలుగు చిత్ర పరిశ్రమంలోనే కొంతమంది డైరెక్టర్లు ఈమధ్య పాన్ ఇండియా ప్రపంచంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సినిమాలు హిట్ అయ్యే కొద్ది ఏ విధంగా హీరోలు రెమ్యూనరేషన్ పెంచుతున్నారో.. అటు డైరెక్టర్లు కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఫ్యాన్ ఇండియా చిత్రాలతో మంచి క్రేజీ ను సంపాదించుకున్న టాప్ డైరెక్టర్లు ఎవరు? ప్రస్తుతం వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు డైరెక్టర్ సుకుమార్ కు మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టాయి.. కానీ పుష్ప మూవీ తో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప2 మూవీ కూడా అంతకుమించి అంచనాలను రీచ్ అవ్వడంతో డైరెక్టర్ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు హీరోలతో సమానంగా 100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నారు. నిజానికి ఈయన ఒక్కడే మాత్రమే కాదు ఈయన కన్నా ముందు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ల విషయానికొస్తే..
తెలుగు సినిమా కి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్లలో మొదటగా వినిపించే డైరెక్టర్ రాజమౌళి… గతంలో ఈయన స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ ని అందుకున్నారు. అయితే బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్గా మారారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ సినిమాని రిలీజ్ చేయడంతో పాటుగా అటు విదేశాల్లో కూడా రిలీజ్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాజమౌళి మొదలుపెట్టిన ఆ కార్యం కాస్త కంటిన్యూ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా చిత్రాల వైపే మొగ్గు చూపిస్తున్నారు.. ఈ డైరెక్టర్ ఒక్కో సినిమాకి దాదాపు 300 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ… ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తిరగ ఎక్కించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఫ్యాన్ ఇండియా డైరెక్టర్గా మంచి క్రేజ్ ని అందుకున్నారు. హనుమాన్ మూవీ ఆయన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఈ డైరెక్టర్ ఒక్కో సినిమాకు దాదాపు 120 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది..
అర్జున్ రెడ్డి మూవీతో క్రేజీ డైరెక్టర్గా మారిన సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రొమాంటిక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ డైరెక్టర్. తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా యానిమల్ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇక ఈ సినిమాలతో పాటుగా ప్రస్తుతం స్పిరిట్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. హీరో ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.. అయితే సందీప్ రెడ్డి వంగ ఒక్కో సినిమాకి దాదాపు 110 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లు వీళ్లే.. ఆ తర్వాత బాబి, కార్తీక్ దండు వంటి డైరెక్టర్లు కూడా మంచి రెమినరేషన్ అందుకుంటున్నారు.