Tim David struggling: బంగ్లాదేశ్ టూర్ (Australia tour of Bangladesh, 2026 ) నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య ఢాకా వేదికగా మూడు వన్డేలు జరిగాయి. ఇందులో రెండింటిలో వరుసగా గెలిచిన బంగ్లాదేశ్, వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇవాల్టి నుంచి ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. బంగ్లాదేశ్ చటోగ్రామ్ లోని బిర్ శ్రేష్ఠో ఫ్లైట్ లెఫ్టినెంట్ మాటియుర్ రెహమాన్ స్టేడియం (Bir Sreshtho Flight Lieutenant Matiur Rahman Stadium, Chattogram) వేదికగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ కు (Tim David struggling) వడదెబ్బ తగిలింది. దీంతో స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ రెండు జట్ల మధ్య చట్టం వేదికగా తొలి టీ20 ప్రారంభం కానుంది. టి20 సిరీస్ నేపథ్యంలో మిచెల్ మార్ష్ రంగంలోకి దిగుతున్నాడు. ఆయన కెప్టెన్సీ లోనే ఈ సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. అటు మొన్నటి వరకు ఐపీఎల్ లో ఇరగదీసిన టిమ్ డేవిడ్ కూడా బరిలోకి దిగుతున్నాడు. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లు… ఎలాగైనా టి20 సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో, కసిగా నిన్న చటోగ్రామ్ లోని బిర్ శ్రేష్ఠో ఫ్లైట్ లెఫ్టినెంట్ మాటియుర్ రెహమాన్ స్టేడియం వేదికగా ప్రాక్టీస్ చేశారు.
50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా తగ్గలేదు. అయితే 30 డిగ్రీలు ఉంటేనే తట్టుకోలేని ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఈ 50 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు విలవిలలాడిపోయారు. ఈ క్రమంలోనే టిమ్ డేవిడ్ కు వడదెబ్బ తగిలింది. దీంతో మైదానంలోనే టీమ్ డేవిడ్ కుప్పకూలాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అయ్యో పాపం అంటున్నారు. ఈ ఎర్ర తోలోడికి ఇన్ని ఫీట్లు అవసరమా ? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అయితే, మరికొందరు టిమ్ డేవిడ్ ను మెచ్చుకుంటున్నారు. తీవ్రమైన ఎండలో కూడా టిమ్ డేవిడ్ ( Tim David) ప్రాక్టీస్ చేశాడని, ఆస్ట్రేలియా కోసం ఎంత వరకైనా వెళతాడని అంటున్నారు.
?igsh=dDZ1ZHk5YmthMzQ=