Weight Loss Pills India| గత కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో బరువు తగ్గించే మాత్రలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఊబకాయం, శరీర రూపం పట్ల ఆందోళన, త్వరిత ఫలితాల కోసం ప్రజలు ఆకర్షితులు కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ మాత్రలు రెండు రకాలుగా ఉంటాయి: వైద్యుల సలహాతో ఇచ్చే మందులు, ఓవర్-ది-కౌంటర్ (OTC) సప్లిమెంట్స్ అంటే మెడికల్ షాపుల్లో ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే మందులు. వైద్య సలహాతో ఇచ్చే మందులలో ఒర్లిస్టాట్ (కొవ్వు శోషణను నిరోధించేవి), ఫెంటర్మైన్ (ఆకలిని తగ్గించేవి) వంటివి ఉన్నాయి. OTC సప్లిమెంట్స్‌లో ఆన్‌లైన్‌లో విక్రయించబడే లేదా ఫిట్‌నెస్ ఐకాన్‌లు ప్రచారం చేసే “బరువు తగ్గించే మాత్రలు”, హెర్బల్, ఆయుర్వేద సన్నాహాలు ఉన్నాయి.
కె జె సోమయ్య హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు అయిన డాక్టర్ యోగేష్ ఖితానీ అభిప్రాయం ప్రకారం.. ఈ మాత్రలు తినడం ఆపేసిన తర్వాత చాలా మంది మళ్లీ బరువు పెరుగుతారని, ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేయనివారు మళ్లీ బరువు వేగంగా పెరుగుతారని చెప్పారు. స్వీయ-ఔషధం తీసుకోవడం, నియంత్రణ లేని సప్లిమెంట్స్ వాడకం పెద్ద ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. బరువు తగ్గించే మందులు తరచుగా కడుపులో సమస్యలు, అధిక రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకునేందుకు కారణమవుతాయి. వీటితో సమస్య తీవ్రంగా ఉంటే కాలేయ నష్టం, హార్మోన్ల మార్పులు, ఇతర మందులతో సంఘర్షణ ఉన్నాయి.
వైద్య సలహా లేకుండా లేదా ఇతర మందులతో కలిపి వీటిని తీసుకుంటే.. ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇతరుల మాటలు విని సొంతంగా ఈ మందులు తీసుకుంటారు. ముఖ్యంగా యుక్తవయస్కులు, స్నేహితుల ఒత్తిడి లేదా రూపం పట్ల ఆందోళన కారణంగా సరైన అనుమతులు లేని ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఈ మందులు అతిగా వాడకం థైరాయిడ్ వ్యాధి లేదా PCOS ఉన్న మహిళలలో ఎండోక్రైన్ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది.
మందుల షాపుల్లో లభించే బరువు తగ్గించే సప్లిమెంట్స్‌ను ఎక్కువ కాలం తీసుకోవడం లేదా తప్పుగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా లివర్ ఫెయిల్ కావడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటివి కనిపించాయి. ఒక యువతి “ఆన్‌లైన్” “సహజ” ఫ్యాట్ బర్నర్‌ను ఉపయోగించిన తర్వాత ఆమె రక్తంలో అంఫెటమైన్ లాంటి పదార్థాలు కనిపించాయి, ఆమె నిరంతరం గుండె దడ, నిద్రలేమి సమస్యలతో బాధపడేది.
డాక్టర్ సలహా ప్రకారం.. బరువు తగ్గించే మాత్రలు తీసుకోవాలనుకునేవారు జాగ్రత్త వహించాలి. బరువు తగ్గడానికి ఎలాంటి అద్భుత ఔషధం లేదు. బదులుగా, అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించి, మీ మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేసి, సురక్షితమైన విధానాన్ని అందించడం మాత్రమే చేయగలరు. ఔషధ చికిత్సలు.. ఎల్లప్పుడూ జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ, ఆహార నియమాలతో కలిపి ఉండాలి.
Also Read: నిద్రలేమి సమస్యకు చెక్.. ఇవి తింటే 24 గంటల్లోనే ప్రాబ్లెం సాల్వ్
బరువు నియంత్రణ కోసం జీవనశైలి మార్పులు, వైద్య సహాయం అవసరం. వైద్యులు, ఆరోగ్య సంస్థలు.. విద్యా కార్యక్రమాలు, ఆన్‌లైన్ కార్యక్రమాలు, బహిరంగ సమాచారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి.