Telugu Producer : ‘ఓడలు బళ్ళు అవుతాయి… బళ్ళు ఓడలవుతాయి’ ఈ పాత సామేత వినే ఉంటారు. ఇప్పుడు ఇది ఓ బడా నిర్మాతకు సరిగ్గా సెట్ అవుతుందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బడా నిర్మాత అంటున్నారు…. పైనా ఆ సామేత అంటున్నారు.. అసలు కథ ఏంటి అని ఆలోచిస్తున్నారా ? అయితే రండి చూద్ధాం ఆ.. కథ ఏంటో…
ఆయన టాలీవుడ్‌లో బడా నిర్మాత. ఆయనకు తెలియకుండా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వదు. ఇక ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇండస్ట్రీ మొత్తం అలర్ట్‌గా ఉంటుంది. ఆయన నిర్మించిన సినిమాలకే కాదు… ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలపై కూడా అంతే ఫోకస్ ఉంటుంది.
ఆయన నిర్మించే సినిమాలన్నా.. ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలన్నా.. ఒక మంచి ఓపెనియన్ ఉంటుంది. ఎందుకంటే.. ఆయన జడ్జిమెంట్ అలాంటిది మరి. అంతటి నిర్మాత ఇప్పుడు చతికిలపడ్డాడట. డబ్బులు పెట్టి నిర్మించే సినిమాలు, ఇతరల దగ్గర నుంచి కొనే సినిమాలు అన్నీ కూడా చేతికి నష్టాన్నే తెప్పిస్తున్నాయి.
గేమ్ లూజ్ అయింది ?
ఈ మధ్య భారీ అంచనాలతో రిలీజ్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ మధ్య బొక్కబోర్లాపడుతున్నాయి. ఇండస్ట్రీకి గేమ్ ఛేంజర్ అవ్వాలని ఓ భారీ సినిమాను చేశాడు. కానీ ఆ గేమ్ లూజ్ అయిపోయింది. దీంతో ఈ బడా నిర్మాత అప్పుల పాలు అయ్యాడట.
జీతాలే ఇవ్వడం లేదు ?
నిర్మాతలు అప్పులు చేయడం కామనే. కానీ, ఈ నిర్మాత అప్పులు చేయడమే కాదు.. వాళ్లు ఆఫీస్‌లో ఉండే ఎంప్లాయిస్‌కి కనీసం జీతాలు కూడా ఇవ్వకలేకపోతున్నాడట. కొంత మంది ఎంప్లాయిస్‌కి కనీసం 3 నెలల జీతం ఇవ్వలేదనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
ఈ మధ్య ఈ బడా నిర్మాత ఆఫీస్‌కు చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ బయటకు వచ్చి… తనకు గత మూడు నెలల నుంచి జీతం ఇవ్వలేదు అంటూ చెప్పుకున్నాడట. అలాగే, మిగితా వారికి జీతాలు ఇవ్వడానికి ఆయన అప్పులు చేస్తున్నాడని కూడా అన్నాడట.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఉన్న ఆయన ఇప్పుడు ఇంతలా చతికిలపడ్డడా ? అంటూ ఇండస్ట్రీ జనాలు అందరూ ఆశ్చర్యపోతున్నారట.
రాబోయే సినిమాలపై ఎఫెక్ట్ ?
దీనికి ఎఫెక్ట్ రాబోయే సినిమాలపై కూడా ఉంటుందట. ఆయన ఇప్పుడు ఓ సినిమాను నిర్మించబోతున్నారు. దీని కోసం డైరెక్టర్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. హీరో కూడా సెట్ అయ్యాడు. ఓ దేవత పేరుతో మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ, ఈ బడా నిర్మాత దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారట. దీంతో ఇన్ని రోజులు వెయిట్ చేసిన డైరెక్టర్ వేరే నిర్మాత దగ్గరకి వెళ్లిపోయాడట. హీరో కూడా వేరే దారి చూసుకుంటున్నాడట.
సెట్‌పై ఒక్క మూవీ కూడా లేదు ?
ఈ అప్పుల ప్రభావం ఎంతలా ఉందంటే… ఆయన నిర్మాణంలో ప్రస్తుతం ఒక్కటి అంటే ఒక్క మూవీ కూడా లేదట. ఒక్క మూవీ కూడా సెట్ పైన లేకుండా ఉండటం ఆ బడా నిర్మాత రీసెంట్ టైమ్స్ లో ఇదే ఫస్ట్ టైం కావొచ్చు.
ఆయన చేయాల్సింది ఏంటి ?
ఇది బయటికి తెలిసిన తర్వాత బడా నిర్మాత పరిస్థితి చూసి… ఈయనేంటి ఇలా అయిపోయాడు అని అంటున్నారట. ఈ పరిస్థితిని చూసి ఆయన గురించి… “ఆయన బయట గ్రౌండ్‌లోకి వచ్చి బ్యాట్ పట్టుకుని ఆడుతున్నాడు. కానీ, ఒక్క బాల్‌ను కూడా హిట్ చేయడం లేదు. గెలవాలంటే, బ్యాట్ మాత్రమే పట్టుకుంటే సరిపోదు.. వచ్చే బాల్‌ను సరిగ్గా అంచనా వేసి హిట్ చేయాలి. హార్డ్‌గా వచ్చే బాల్‌ను డిఫెన్స్ చేయాలి. అలా చేస్తేనే ఆ బడా నిర్మాత మళ్లీ తిరిగి ఫాంలోకి వస్తాడు” అని అంటున్నారు.