BigTV English

Kanchana 4 : టూరిస్ట్ ఫ్యామిలీ పిల్లోడు భలే ఛాన్స్ కొట్టాడు

Kanchana 4 : టూరిస్ట్ ఫ్యామిలీ పిల్లోడు భలే ఛాన్స్ కొట్టాడు

Kanchana 4 : కొన్ని సినిమాలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తాయి. అలాంటి సినిమాలలో 2025లో వచ్చిన తమిళ్ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ సినిమా హాట్స్టార్లో తెలుగు వెర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. సూర్య నటించిన రెట్రో సినిమాతో పాటు ఈ సినిమా విడుదలైంది.


రెట్రో సినిమా ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్నాడు అంటే చాలామంది అంచనాలు విపరీతంగా పెంచుకున్నారు. సూర్యకి కూడా ఈ సినిమాతో మంచి హిట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇవేవీ జరగలేదు. మరోవైపు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మాత్రం విపరీతమైన పేరును సాధించుకుందాం.

భలే ఛాన్స్ కొట్టాడు 


టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కమలేష్. తనదైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ అనే విపరీతంగా ఆకట్టుకున్నాడు కమలేష్. సినిమా చేయడానికి అంటే ముందు చాలా రియాలిటీ షోస్ లో కనిపించి మంచి కామెడీ చేశాడు. ఇప్పుడు కమలేష్ కాంఛన 4 సినిమాలోని అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాలో తనది ఫుల్ లెన్త్ రోల్ ఉండబోతున్నట్లు కమలేష్ తెలిపాడు. ఇక రీసెంట్ గా సెట్స్ లో పూజ హెగ్డే తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు కమలేష్. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో అంతలా ఆకట్టుకున్న కమలేష్ ఈ సినిమాతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

 

నో హిట్స్ ఫర్ పూజ 

పూజా హెగ్డే విషయానికి వస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి బీభత్సమైన కలెక్షన్లు వసూలు చేశాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో పూజ హెగ్డే సక్సెస్ కొట్టి చాలా రోజులు అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ సినిమాలో మౌనిక అనే పాటలో కనిపించింది పూజ. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు హిట్ లేని పూజకు కనీసం కాంఛన అయిన హిట్ అవుతుందేమో వేచి చూడాలి.

Also Read: Lokesh Kanagaraj: లియో ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ పై డైరక్టర్ లోకేష్ రియాక్షన్

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×