Monsoon Hair Oil: వర్షాకాలం ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఈ సీజన్ చాలా ఉపశమనం అందిస్తుంది. కానీ వర్షాకాలంలో జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం ఎక్కువవుతుంది. దీనిని నియంత్రించడం చాలా కష్టమైన పని.
వాస్తవానికి.. గాలిలోని తేమ, ధూళి తలపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా జుట్టు రాలడం వేగంగా పెరుగుతుంది. సరైన సమయంలో జుట్టు రాలడాన్ని ఆపకపోతే, మీరు బట్టతల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ.. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలంలో ఎలాంటి హోం రెెమెడీ వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుందనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇఫ్పుడు తెలుసుకుందాం.
కావాల్సినవి:
2 టేబుల్ స్పూన్లు- మెంతులు
6 టేబుల్ స్పూన్లు- కొబ్బరి నూనె
ఈ విధంగా సిద్ధం చేయండి:
పై రెండు పదార్థాలతో మీరు జుట్టు రాలడాన్ని చాలా వరకు ఆపవచ్చు. దీని కోసం.. ముందుగా, మెంతుల గింజలను రాత్రంతా నానబెట్టండి. రాత్రంతా నానబెట్టడం వల్ల అవి ఉబ్బుతాయి. ఆ తర్వాత మీరు ఉదయం వాటిని రుబ్బుకుని పేస్ట్ తయారు చేసుకోవచ్చు. దీని తరువాత.. ఒక పాన్ లో కొబ్బరి నూనె వేడి చేసి, ఈ పేస్ట్ వేసి బాగా కలపండి. రెండింటినీ కలిపి తక్కువ మంట మీద 4–5 నిమిషాలు ఉడికించాలి. మెంతులు గోధుమ రంగులోకి మారి, సువాసన రావడం ప్రారంభించినప్పుడు గ్యాస్ ఆపేయండి. ఇప్పుడు నూనెను చల్లార్చి వడకట్టుకోండి.
ఎలా ఉపయోగించాలి ?
ఈ నూనెను ఉపయోగించడం చాలా సులభం. దీని కోసం.. మొదట మీరు తలస్నానం చేయండి. తలపై చర్మం శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నూనె ప్రభావ వంతంగా పనిచేస్తుంది. మీ జుట్టు శుభ్రంగా ఉన్నప్పుడు, ఈ నూనెతో తలపై చర్మాన్ని తేలికగా మసాజ్ చేయండి. మీరు దానిని రాత్రంతా ఉంచకూడదనుకుంటే.. స్నానానికి కనీసం రెండు గంటల ముందు ఈ నూనెతో జుట్టును మసాజ్ చేయండి. దీని తర్వాత.. షాంపూతో జుట్టును వాష్ చేయండి. మీరు ఈ నూనెను వారానికి మూడు సార్లు కూడా ఉపయోగించవచ్చు.