Trance Of Omi : పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మనం ఎప్పటినుంచో వింటున్నం. అలానే నేనింతే సినిమాలో వేణుమాధవ్ ఒక సీన్ లో మాట్లాడుతూ ఈరోజు నుంచి నా పేరు సత్తిబాబు గారు సెంథిల్ అంటాడు. మనోళ్ళకి తమిళ్ డైరెక్టర్లు అంటే మోజు, అని ఒక హీరోకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా తమిళ్లోనే కథ ను చెప్తాడు అది సినిమాలో ఒక పాత్ర. ఇక రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి విపరీతమైన ఎలివేషన్ ఇస్తుంటారు ట్విట్టర్ యువత.
టి ఎఫ్ ఐ బానిసలు కూడా అనిరుద్ ను నెక్స్ట్ లెవెల్ లో లేపుతారు. అయితే బహుశా ఇవి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి బాగా అసంతృప్తిని మిగిల్చుంటాయని చెప్పాలి. అందుకే గతంలో ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. ఓజి సినిమా అనేది మాస్టర్,విక్రమ్,లియో ఈ మూడు సినిమాలకి కూడా సమాధానం అవుతుంది అంటూ చెప్పాడు. ఇప్పుడు దానిని నిజం చేసే పనిలో ఉన్నాడు తమన్.
ఓజి vs ఓమి
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి సినిమాకి తమన్ సంగీతం అందించారు. మ్యూజిక్ పరంగా తమ న్యాయం చేశారు. కానీ తమ మ్యూజిక్ కి న్యాయం చేయగలిగే సినిమా ఒకటి కూడా పడలేదు అని అసంతృప్తితో ఉండేవాడు. సరిగ్గా అలాంటి సినిమాను సుజిత్ చేస్తున్నాడు. ఈ సినిమా పైన విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. అలానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి మ్యూజిక్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది. ఓజి టైటిల్ సాంగ్ మాత్రమే కాకుండా, ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓమి అనే పాత్రలో కనిపిస్తున్నాడు దానికి కూడా అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. కొద్దిసేపటి క్రితమే దానిని అఫీషియల్ గా రిలీజ్ చేశారు.
ఇంకో 14 రోజులు
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమా సరిగ్గా 14 రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదు అని అర్థమైపోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి అంతటినీ కూడా ఈ సినిమా తీరుస్తుంది అని నమ్ముతున్నారు. ఈ సినిమాకి యునానిమస్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ చూడొచ్చు.
Also Read: Actor Wife : ప్రాణం తీసిన ఐస్ క్రీమ్, దిగ్బ్రాంతి లో ఆ నటుడి కుటుంబం