Adilabad Collectorate: ఆదిలాబాద్ కలెక్టరేట్ లో పెను ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ లో పై అంతస్తు స్లాబ్ కూప్పకూలింది. మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్ స్లాబ్ నెమ్మదిగా కూలుతుండడం ఉద్యోగులు వెంటనే గమనించారు. అక్కడ నుంచి పరుగులు ప్రాణాలను రక్షించుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొన్ని సెకన్లు ఆలస్యమైనా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయాలపాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, భవనం లోపలి గోడులు, పైకప్పులు ధ్వంసమయ్యాయి. ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులు, ఫైళ్లు కూలిన శిథిలాలు వర్షపు నీటికి తడిసి నాశనమయ్యాయి. ఇది సంబంధిత విభాగాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఆర్థిక నష్టం కూడా ఏర్పడింది.
ఈ కలెక్టరేట్ భవనం శిథిలావస్థ దశలో ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు వారీగా కలెక్టరేట్ కార్యాలయానికి వందలాది మంది ప్రజలు వచ్చిపోయే ఈ భవనంలో సాయంత్రం సమయం కావటంతో చాలా మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోయారు. ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ సంఘటన తర్వాత జిల్లా అధికారులు భవనం పరిస్థితిని పరిశీలించాని.. మరమ్మతులు లేదా విభాగాలను కొత్త భవనాలకు మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాత భవనాల నిర్వహణలో అలసత్వం లేకుండా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన భవనాల భద్రతపై మరింత అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.