Trisha Krishnan:ప్రముఖ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది త్రిష కృష్ణన్ (Trisha Krishnan). 42 ఏళ్ల ప్రాయంలో కూడా అంతే అందంతో.. విలక్షణమైన నటనతో ఆడియన్స్ ను అబ్బురపరుస్తోంది. యంగ్ హీరోల సినిమాలలోనే కాదు చిరంజీవి(Chiranjeevi ), కమలహాసన్(Kamal Haasan) వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇటీవలే కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నట్లు సమాచారం.
త్రిష ఖాతాలో అరుదైన రికార్డు..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిషకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్రిష ఆలయానికి యాంత్రిక ఏనుగును బహూకరించినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే..” చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా (PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అరుప్పుకోట్టై లోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే యాంత్రిక ఏనుగును త్రిష బహూకరించారు. దీనిని సాంప్రదాయ మంగళ వాద్యాల మధ్య అందజేసినట్లు పీఎఫ్సీఐ నిర్వహకులు స్పష్టం చేశారు. ఇక ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి కావడం గమనార్హం”. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి త్రిషపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మడి ఖాతాలో ఇదో అరుదైన రికార్డు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కెరియర్ లో భారీ సక్సెస్..
కోలీవుడ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘వర్షం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న త్రిష వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.వర్షం సినిమా కంటే ముందే సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. ప్రశాంత్ నటించిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది. ఇక తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో నటించిన త్రిష తన అద్భుతమైన నటనతో మూడు దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలు సొంతం చేసుకుంది.
వ్యక్తిగతంగా రూమర్స్ ఎదుర్కొంటున్న త్రిష..
ఇకపోతే కెరియర్ పరంగా రీ ఎంట్రీలో కూడా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె వ్యక్తిగతంగా ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. 42 సంవత్సరాలు వచ్చినా వివాహం చేసుకోకపోవడం, దీనికి తోడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ కొత్త రూమర్లకు తెరలేపింది. ఇక ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గత రెండు రోజుల క్రితం విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఒకే ఇంట్లో కనిపించి రూమర్స్ కి ఆజ్యం పోశారు. అలా కెరియర్ పరంగా భారీ సక్సెస్ చూసింది. కానీ వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.
ALSO READ:Ileana D’Cruz: ఎట్టకేలకు రెండో కొడుకుని చూపించేసిన ఇలియానా.. ఏం పేరు పెట్టారంటే?