West Indies : ప్రస్తుతం రోజు రోజుకు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా మహిళల పై, యువతుల పై, మైనర్ బాలికల పై రోజు రోజుకు అత్యా***చారాలు పెరిగిపోతున్నా యి. కేవలం భారతదేశంలో మాత్రమే ఇలా జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రధానంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. సినిమా రంగంలో, క్రీడారంగంలో ఉన్న ప్రముఖులు సైతం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వెస్టిండీస్ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరిస్ జరుగుతోంది. ఈ సిరీస్ మధ్యలోనే వెస్టిండీస్ క్రికెట్ లో ఓ వార్త సంచలనం సృష్టించింది.
క్రికెటర్ షమర్ జోసెఫ్ పై ఆరోపణలు..
ప్రస్తుతం ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో బిజీగా ఉన్న వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు చెందిన ఒక ఆటగాడి పై అత్యా***చారం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి వెస్టిండీస్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఏకంగా 11 మంది మహిళలు వెస్టిండీస్ క్రికెటర్ పై అత్యా***చారం ఆరోపణలు చేశారు. అయితే వారిలో ఒకరు మైనర్ బాలిక కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఆరోపణల తర్వాత వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆటగాడిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ షమర్ జోసెఫ్ పై లైంగిక వేధింపులు, అత్యా**చార ఆరోపణలు వచ్చాయి. గయానా కి చెందిన అతని పై మొత్తం 11 మంది మహిళలు ఆ క్రికెటర్ పై అత్యాచారం లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. అతను ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ సిరీస్ లో కూడా ఉన్నారని ఓ నివేదిక చెప్పింది. ఇది మాత్రమే కాదు వెస్టిండీస్ బోర్డు ఈ ఆటగాడి గుర్తింపును వెల్లడించకుండా కేసును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముందుకు వచ్చిన 11 మంది
ముఖ్యంగా ఓ యువతి తో పాటు కొంత మంది మహిళలు ఆ క్రికెటర్ పై అత్యా***చారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గయనా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మార్చి 03, 2023న బైర్బెస్ లోని న్యూ ఆమ్ స్టర్ డామ్ లోని ఓ నివాసంలో ఆ క్రికెటర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి, ఆమె కుటుంబం ఆరోపించింది. ఇక ఈ ఘటన జరిగిన తరువాత మరికొంత మంది మహిళలు కూడా ఇలాంటి ఆరోపణలతోనే ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చారు. ఆ క్రికెటర్ పంపిన సందేశాల స్క్రీన్ షాట్ లు, వాయిస్ నోట్స్ తో పాటు పలు ఆధారాలను సమర్పించినట్టు సమాచారం. అయితే ఆ క్రికెటర్ పై వచ్చిన ఆరోపణలు, బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదు గురించి తమకు తెలియదని.. ఈ విషయం పై ఇప్పుడే తాము ఏమీ మాట్లాడలేమని క్రికెట్ వెస్టిండిస్ అధ్యక్షుడు కిషోర షా మీడియాకి వివరించారు. ప్రస్తుతం వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఆరోపణలు రావడంతో చర్చనీయాంశంగా మారింది.