Adarsha Kutumbam House No.47:కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే మొనాటనీని బ్రేక్ చేస్తూ ప్రాసలు, పంచ్‌ల సరికొత్త డైలాగ్ ఫార్మాట్‌తో ఆడియన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తాడు త్రివిక్రమ్. ఇక కథలు ఎక్కడెక్కడి నుంచో ఎత్తేసి సినిమాలు తీసినా నవ్వుల వర్షంలో తడిసిపోయిన అభిమానులు వాటిని డిస్టింక్షన్‌లో పాస్ చేసేసేవారు. కానీ ఎక్కడ మొదలెట్టామో అక్కడే అన్నట్టుగా అవే కథలను, అవే కామెడీ సీన్లను అటు తిప్పి ఇటు తిప్పి తీసుకుపోతున్నాడు గురూజీ.ఇక తాజాగా వెంకీ మామతో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ కూడా పాత సినిమాలలోని ఎమోషన్, కామెడీ సీన్లను అటు తిప్పి ఇటు తిప్పి సినిమాగా తీస్తున్నాడని ఇన్‌సైడ్ టాక్.
కొంచెం కూడా బోర్ కొట్టదా?
నిజానికి వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో అంటే ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ మూవీస్‌ను మించి ఆశిస్తారు. కానీ వినిపిస్తున్న టాక్స్ ప్రకారం గురూజీ మళ్లీ తన పాత సినిమాలైన ‘అల వైకుంఠపురములో’, ‘అత్తారింటికి దారేది’ లాంటి ఫ్యామిలీ డ్రామాలనే నమ్ముకున్నాడని తెలుస్తోంది.
సినిమా మొత్తం ఒకే ఇంట్లో, నిండా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎమోషనల్ అండ్ కామెడీ సీన్స్‌తో నింపేశాడని ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్. దీంతో “గురూజీ.. ఇంకా ఎన్ని రోజులు అదే ఇంట్లో అవే కథల్ని తిప్పి తిప్పి చూపిస్తారు? పాత సీసా పాత వైన్ అంటే కొంచెం కూడా బోర్ కొట్టదా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు.
ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్ సత్యను
వాస్తవంగా వెంకీ మామ కామెడీ టైమింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనకి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనకి జోడీగా ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్ సత్యను క్యాస్ట్ చేశాడట. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నవ్వుల వర్షం కురిపిస్తాయని యూనిట్ చెబుతున్నా స్టోరీలో సాలిడ్ కంటెంట్ లేకుండా కేవలం నాలుగు కామెడీ సీన్స్‌ను నమ్ముకుంటే సినిమాను గట్టెక్కిస్తాయా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.
ఇలాగే భారీ అంచనాలు పెట్టుకున్న ‘అజ్ఞాతవాసి’, ‘గుంటూరు కారం’ విషయంలో ఏమి జరిగిందో మనకి బాగా తెలుసు. యూట్యూబ్‌లో బిట్లు బిట్లు చూసుకోవడానికి మాత్రమే పనికి వచ్చాయి తప్ప థియేటర్లలో కాసుల వర్షం కురిపించలేకపోయాయి. చూడాలి మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కొత్తగా ట్రై చేస్తాడా లేక వినిపిస్తున్నట్టుగా అదే పాత ఫార్ములాతో అడ్డంగా మునుగుతాడా.
also read :చిత్ర పరిశ్రమలో తీరని విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్లకే ప్రముఖ నటి మృతి!
రొటీన్ రొట్ట సంగీతం వినాల్సిందేనా
ఇక ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్… హర్షవర్ధన్ రామేశ్వర్ను పక్కన బెట్టి థమన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారట. నిజానికి హర్షవర్ధన్ ఇన్ అయినప్పుడే అందరూ అనుకున్నారు. అచ్చొచ్చిన థమన్‌ను కాదని గురూజీ ఇతనికి ఎలా ఓటు వేశాడని.
మొత్తానికి ఆస్థాన సంగీత దర్శకుడిని వదిలిపెట్టలేదన్న మాట. అయితే ‘యానిమల్’ వంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ ఉంటే సినిమాకు సరికొత్త సౌండింగ్ వచ్చేదని, థమన్ వచ్చేశాడు కాబట్టి అదే రొటీన్ రొట్ట సంగీతం వినాల్సిందేనన్న నెగిటివ్ కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ మార్క్ రిచ్‌నెస్
ఇక సినిమా ప్రస్తుతం మలక్‌పేట్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోందని సమాచారం. లోకల్ సెటప్‌లో సినిమా తీస్తున్నా అందులో త్రివిక్రమ్ మార్క్ రిచ్‌నెస్ ఉంటుందని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా సినిమాను గాంధీ జయంతి లేదా దసరా రేస్లో నిలబెట్టాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది హారిక అండ్ హాసిని క్రియేషన్స్. చూడాలి పలు రకాలుగా వినిపిస్తున్న ఈ గాసిప్స్‌కు మేకర్స్ ఎక్కడ ఎలా ఎండ్ కార్డ్ వేస్తారో!
also read :మెక్సికో గడ్డపై రాజమౌళి ‘మైండ్ గేమ్’.. గ్లోబల్ బాక్సాఫీస్ టార్గెట్‌గా ‘వారణాసి’ మాస్టర్ ప్లాన్!