E-Paper
Advertisement

ప్రేయసిని చంపేసిన గ్యాంగ్ పై ప్రతీకారం… 12 ఏళ్లు వెనక్కి వెళ్లే యువకుడు… యానిమే లవర్స్ కు ఐ ఫీస్ట్

ప్రేయసిని చంపేసిన గ్యాంగ్ పై ప్రతీకారం… 12 ఏళ్లు వెనక్కి వెళ్లే యువకుడు… యానిమే లవర్స్ కు ఐ ఫీస్ట్
Advertisement

Tokyo Revengers OTT: ప్రపంచవ్యాప్తంగా యానిమే లవర్స్‌ను ఉర్రూతలూగించిన జపనీస్ యానిమే సిరీస్‌లలో ‘Tokyo Revengers’కు ప్రత్యేక స్థానం ఉంది. టైమ్ ట్రావెల్, గ్యాంగ్ వార్స్, స్నేహం, ప్రేమ, ప్రతీకారం వంటి అంశాలను ఆసక్తికరంగా మేళవించి రూపొందించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన జీవితంలో జరిగిన విషాదాన్ని మార్చేందుకు ఓ యువకుడు ఏకంగా 12 ఏళ్లు వెనక్కి వెళ్లి, ప్రమాదకరమైన గ్యాంగ్‌తో తలపడితే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం ఈ యానిమే సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో చూడొచ్చా ? అనే వివరాల్లోకి వెళ్తే..

కథలోకి వెళ్తే…

తకెమిచి హనగాకి అనే 26 ఏళ్ల యువకుడు జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు. ఒకరోజు టీవీలో వచ్చే వార్త అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. తన స్కూల్ రోజుల్లో ప్రేమించిన ఏకైక అమ్మాయి హినాటా తచిబానా, ఆమె తమ్ముడు నవోటో ఇద్దరూ ప్రమాదకరమైన ‘టోక్యో మంజీ గ్యాంగ్’ చేతిలో హత్యకు గురయ్యారని తెలుసుకుని షాక్ అవుతాడు.

Advertisement

మరుసటి రోజు రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉండగా ఎవరో అతడిని పట్టాలపైకి తోసేస్తారు. రైలు ఢీకొట్టబోతున్న ఆ క్షణంలో చనిపోతానని భావించిన తకెమిచి.. కళ్లు తెరిచేసరికి సరిగ్గా 12 ఏళ్లు వెనక్కి, తన మిడిల్ స్కూల్ రోజుల్లోకి వెళ్లిపోయి ఉంటాడు. అక్కడే అతనికి హినాటా తమ్ముడు నవోటో ఎదురవుతాడు. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం గురించి అతడికి ముందుగానే చెప్పడంతో వర్తమానంలో నవోటో ప్రాణాలతో బయటపడతాడు. పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అయిన నవోటో సహాయంతో తకెమిచి మళ్లీ గతంలోకి వెళ్లే అవకాశం పొందుతాడు.

ఇప్పుడు అతని ముందున్న లక్ష్యం ఒక్కటే.. హినాటా ప్రాణాలను కాపాడటం. ఇందుకోసం భవిష్యత్తులో క్రూరమైన క్రిమినల్ ముఠాగా మారబోయే టోక్యో మంజీ గ్యాంగ్‌లోకి అడుగుపెడతాడు. అక్కడ గ్యాంగ్ నాయకుడు మైకీ, అతని సన్నిహితుడు డ్రాకెన్‌లతో పరిచయం పెంచుకుంటాడు. అయితే ఈ గ్యాంగ్‌లోని స్నేహాలు, అంతర్గత విభేదాలు, ప్రత్యర్థి ముఠాలతో జరిగే పోరాటాలు తకెమిచి అనుకున్నంత సులభంగా ఉండవు.

Advertisement

ప్రతి సారి గతంలో ఏదైనా మార్చినప్పుడు భవిష్యత్తులో కొత్త పరిణామాలు ఎదురవుతుంటాయి. హినాటాను కాపాడాలనే ప్రయత్నంలో తకెమిచి తన స్నేహితుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అతను గ్యాంగ్‌లోని విభేదాలను ఎలా పరిష్కరించాడు? మైకీ, డ్రాకెన్‌ల జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను మార్చగలిగాడా? హినాటాను చివరికి కాపాడగలిగాడా? అనేదే ఈ సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. గ్యాంగ్ వార్స్, టైమ్ ట్రావెల్, ఊహించని ట్విస్టులు, స్నేహం కోసం ప్రాణాలకు తెగించే పాత్రలతో ఈ యానిమే ఆసక్తికరంగా సాగుతుంది. యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్న కథలను ఇష్టపడేవారికి ‘Tokyo Revengers’ మంచి ఎంపిక.

తెలుగు డబ్బింగ్ ఉందా ?

కెన్ వకుయి రాసిన మాంగాపై ఆధారంగా ‘Tokyo Revengers’ యానిమే రూపొందింది. కోయిచి హత్సుమి దర్శకత్వం వహించగా, LIDEN FILMS యానిమేషన్ అందించింది. తకెమిచి పాత్రకు యూకీ షిన్, హినాటా పాత్రకు అజుమి వాకి, నవోటో పాత్రకు ర్యోటా ఒసాకా వాయిస్ అందించారు. 2021 ఏప్రిల్ 11న వచ్చిన  ఈ సిరీస్‌లో తొలి సీజన్‌కు 24 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ యానిమే సిరీస్ ప్రస్తుతానికి JioHotstar లో జపనీస్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్, హిందీ ఆడియో ఆప్షన్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు.

Read Also: ధోళక్‌పూర్‌పై రాక్షసుల దండయాత్ర… రంగంలోకి దిగే చిన్ని భీమ్ గ్యాంగ్… పిల్లలకు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్

Tags

Related News

అడవుల్లో జోకర్ అరాచకం… 2016లో అమెరికాని షేక్ చేసిన క్లౌన్ల ఘటన… ఆ భయం వెనకున్న అసలైన కథ

ఇదెక్కడి కొరియన్ థ్రిల్లర్రా సామీ… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది… చావాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి

డైనోసార్ల ఐలాండ్‌లో చిక్కుకున్న పా పెట్రోల్ టీమ్… అగ్నిపర్వతం బద్దలైతే అదిరే ప్లాన్… పిల్లలకు ఫుల్ మీల్స్

చిరు  ‘మెగా వర్స్’ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

ధోళక్‌పూర్‌పై రాక్షసుల దండయాత్ర… రంగంలోకి దిగే చిన్ని భీమ్ గ్యాంగ్… పిల్లలకు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్

ప్రతీ కేసు ప్రాణసంకటమే… నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే డాక్టర్లు… హాస్పిటల్‌లో జరిగే హైటెన్షన్ డ్రామా

మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×