Ramiz Raja: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ పర్యటనలో టి-20 సిరీస్ ని కైవసం చేసుకున్న పాకిస్తాన్ జట్టు.. స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ని మాత్రం వెస్టిండీస్ 2 – 1 తేడాతో కైవసం చేసుకుంది. ముఖ్యంగా 34 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్.. పాకిస్తాన్ పై వన్డే సిరీస్ లో విజయం సాధించడం ప్రత్యేకం. 1991 తరువాత వెస్టిండీస్ కి పాకిస్తాన్ జట్టుపై ఇదే తొలి సిరీస్ విజయం. అయితే ఈ వన్డే సిరీస్ లో కీలకమైన మూడవ వన్డేలో వెస్టిండీస్.. పాకిస్తాన్ ని 202 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.
Also Read: Sachin Tendulkar: సారా స్నేహితురాలినే గోకిన అర్జున్… సచిన్ కొడుకు ఇంత కామాంధుడా?
ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. మొదట కెప్టెన్ షాయ్ హెప్ విధ్వంసకర సెంచరీతో రాణించగా.. ఆ తర్వాత లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జెడెన్ సీల్స్ సంచలన బౌలింగ్ తో సత్తా చాటాడు. ఈ సిరీస్ లో మొదటి వన్డేలో పాకిస్తాన్ గెలుపొందగా.. మిగతా రెండు వన్డేల్లో వెస్టిండీస్ గెలుపొందింది. ఇక మూడవ వన్డేలో ఓటమి తర్వాత పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ పై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తాయి. మూడవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య చేదనలో పాకిస్తాన్ కేవలం 92 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. జైదేవ్ సీల్స్ కేవలం 18 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అయితే పాకిస్తాన్ బ్యాటర్లలో ఐదుగురు డక్ ఔట్ కావడం గమనార్హం. వీరిలో కెప్టెన్ రిజ్వాన్ కూడా ఉన్నారు. ఇక బాబర్ అజామ్ కూడా కేవలం 9 పరుగులకే పరిమితమయ్యాడు. పదవ ర్యాంకు జట్టు అయిన వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది పాకిస్తాన్. దీంతో ఇలా అయితే ఆసియా కప్ బరిలోకి దిగితే పరిస్థితి మరింత దారుణం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షై హోప్ అదరగొట్టిన అదే పిచ్ పై పాకిస్తాన్ స్టార్లు మాత్రం తేలిపోయారు. వెస్టిండీస్ జట్టులో అతనొక్కడు చేసిన స్కోరుని పాకిస్తాన్ జట్టు సభ్యులంతా కలిసి కూడా చేయలేకపోయారు. పాకిస్తాన్ మొత్తం 176 బంతుల్లో 92 పరుగులు మాత్రమే చేసింది. కానీ షై హోప్ కేవలం 94 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి తరువాత.. పాకిస్తాన్ జట్టు, కోచ్ పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ట్రానిడాడ్ లోని పరిస్థితులను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
Also Read: Grace Hayden on Pant: రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురు మోజు.. బోల్డ్ కామెంట్స్ వైరల్ !
” ఈ పిచ్ పరిస్థితులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవుతున్నాయి. అందుకే వెస్టిండీస్ జట్టు అత్యున్నత స్థాయిలో పోటీ పడడం కష్టతరం అవుతుంది. వెస్టిండీస్ పిచ్ లు నాసిరకం అని నేను ఇంతకుముందే చెప్పాను. అందుకే వెస్టిండీస్ క్రికెట్ ముందుకు సాగడం లేదు. చాలామంది ఇలాంటి పిచ్ ల సమస్యలతో బాధపడుతున్నారు. ఐసీసీ టోర్నమెంట్లలో ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తాయి. వారు వారి గత వైభవాన్ని పునరుద్ధరించాలని భావిస్తే.. ఆ మైదానాలను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే వెస్టిండీస్ బౌలింగ్ చేసే సమయంలో బంతిలో చిప్ పెట్టారు. అందుకే మూడవ వన్డేలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఈ విషయాన్ని మేము ఐసీసీ దృష్టికి తీసుకువెళతాము” అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు రమీజ్ రాజా.