E-Paper
Advertisement

Inzamam-ul-Haq: న‌ఖ్వీ విశ్వాసం లేని కుక్క‌…ఇండియాకు అమ్ముడుపోయాడు, ఇంజమామ్ సీరియ‌స్‌

Inzamam-ul-Haq: న‌ఖ్వీ విశ్వాసం లేని కుక్క‌…ఇండియాకు అమ్ముడుపోయాడు, ఇంజమామ్ సీరియ‌స్‌
Advertisement

Inzamam-ul-Haq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan ) మధ్య మ్యాచ్ జరగడంపై సందిగ్ధత దాదాపు తొలగినట్లే తెలుస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 15వ తేదీన మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే, నిన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ నఖ్వీతో ఐసీసీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన పెద్దలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ డీలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేందుకు మొహ్సీన్ న‌ఖ్వీ ( mohsin naqvi) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న‌ఖ్వీ విశ్వాసం లేని కుక్క అంటూ ఫైర్ అయ్యారు. ఇండియాకు అమ్ముడుపోయాడని నిప్పులు చెరిగారు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

న‌ఖ్వీ విశ్వాసం లేని కుక్క‌…ఇండియాకు అమ్ముడుపోయాడు, ఇంజమామ్ సీరియ‌స్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఐసీసీ పెద్దలతో నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ చర్చలు కూడా చేశారు. ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మొహ్సీన్ న‌ఖ్వీ దిగివచ్చారట. అయితే కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ కండిషన్లకు ఐసీసీ కూడా ఓకే చెప్పగా కొన్ని పరిశీలిస్తామని వెల్లడించిందట. దీంతో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నఖ్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నఖ్వీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ అమ్ముడుపోయాడని మండిపడ్డారు. ఇండియా కరెన్సీకి నఖ్వీ అమ్ముడుపోయాడని.. అందుకే ఇప్పుడు మ్యాచ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫైర్ అయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్ కు వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. డబ్బు కోసం దురాశతో నఖ్వీ యూటర్న్ తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంజమామ్-ఉల్-హక్. ఇక ఇంజమామ్-ఉల్-హక్ ప్రకటన నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

ఐసీసీ ముందు పాకిస్తాన్ పెట్టిన కండిషన్లు ఇవే

Advertisement

ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే కొన్ని కండిషన్లు పెట్టిందట పాకిస్తాన్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రెవెన్యూ షేర్ తమ జట్టుకు ఎక్కువ రావాలని వెల్లడించిందట. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా చూడాలని కోరిందట. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే షేక్ హ్యాండ్ సంప్రదాయం మళ్లీ రావాలని కోరిందట.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×