BigTV English

Cine Workers Strike: చిత్రపురి సిత్రాలు.. సమ్మె వెనుక కుట్ర కోణం ఉందా?

Cine Workers Strike: చిత్రపురి సిత్రాలు.. సమ్మె వెనుక కుట్ర కోణం ఉందా?


Unknown Facts Behind Cine Workers Strike: ప్రస్తుతం టాలీవుడ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వేతనాలను పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో మీడియం, చిన్న సినిమాల షూటింగ్లు బంద్ అయ్యాయి. ఒప్పందం ప్రకారం 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్చేస్తుండటం.. నిర్మాతల మండలి కుదరదని తేల్చేసాయి. దీంతో కార్మికులు మరింత రెచ్చిపోతూ ధర్నాలు, గొడవలకు దిగుతున్నాయి. షూటింగ్కి వెళ్లేవారిని సైతం బెదిరిస్తూ.. షూటింగ్లకు అంతరాయం కలిగిస్తున్నాయి. అయితే కార్మికుల సమ్మె వెనక పెద్ద కుట్ర కోణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విషయంలో కార్మికుల తీరు కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అనే అందచందంగా ఉందంటున్నాయి ఇండస్ట్రీవర్గాలు.

చెలరేగిపోతున్న యానియన్ నాయకులు


వీరిని అడ్డంపెట్టుకుని నాయకులు చెలరేగిపోతున్నారు. నిజానికి సమ్మె వల్ల ఎక్కువ నష్టపోయేది కార్మికులే. మరోవైపు నిర్మాతలు. కానీ, ఫేడరేషన్వచ్చే నష్టమేమి లేదుకానీ, వారి అధిపత్యం చూపించుకునేందుకు కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకి దిగేలా నాయకులు చేశారన్నదే కొందరి వాదన. నాయకుల చలామణికి సినీ కార్మికులు నిర్లక్ష్యతనమే ప్రధాన కారణమని, సమ్మె అంశంలో వారిపై జాలి కలగడం లేదంటున్నారు. తెలుగు సినిమా కార్మికుల ఫెడరేషన్ ఏకఛత్రాధిపత్యం గా మూర్ఖంగా కుట్రపూరితంతో తీసుకున్న నిర్ణయమనే ఆలోచనలో నిర్మాతల మండలి ఉంది. దీంతో వారిని కట్రను బెడిసి కొట్టేలా నిర్మాతలు నిర్ణయం ఉందని అంటున్నారు. దీని కారణం చిత్రపురిక కాలనీ సిత్రాలు. ఫెడరేషన్నాయకులు విషపూరితమైన కుట్ర ఉందని, కార్మికులను అడ్డుపెట్టుకుని వేతనాల్లో కోట్లు దోచుకునే కుట్ర జరుగుతుందనేది కొందరి వాదన. ఇది తెలియక నేతను గుడ్డిగా నమ్మి కార్మికులు మోసపోతున్నారు.

కార్మికుల నిర్లక్ష్యం..

వారికి జై కొడితే పని ఇస్తారనే అపనమ్మకంతో చేలో పడినట్టు మద్దతు పలుకుతున్నారు. అందుకే కార్మికుల సమ్మె విషయంలో నిర్మాతలు మొండివైఖరి చూపిస్తున్నారుదీనికి కారణం నాయకుల ఇస్టానుసారమైన నిర్ణయాలు.. వాటికి కార్మికులు మద్దతు తెలపడం నిర్మాతలను మరింత మొండిగా మారుస్తోంది. వారి మద్దతే నాయకులను మాఫియాగా మారడానికి, తప్పులపై తప్పులు చేస్తూ కోట్లు దోచుకోవడానికి ప్రధాన కారణం! గత కొన్నేళ్లుగా కార్మికులను అడ్డు పెట్టుకుని నేతలు చెలరేగిపోతున్నారట. ఇప్పుడు అందనంత ఎత్తుకు చేరుకుని తమాషా చూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయినిజానికి సినీ కార్మికులు అంటే ఇందులో లైట్‌ బాయ్‌ నుంచి ప్రొడక్షన్‌ మేనేజర్‌ వరకు.. మేకప్‌ ఆర్టిస్ట్‌ నుంచి కాస్ట్యూమ్‌ హెల్పర్‌ వరకు.. డ్రైవర్ నుంచి క్రెన్‌ ఆపరేటర్‌.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సినిమాటోగ్రాఫర్, జూనియర్ ఆర్థిస్టుల వరకు అందరూ ఉంటారు! ఇప్పటి వరకు 24 క్రాఫ్ట్స్ యూనియన్ల లో సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే పని దొరికేది.

ఈ యూనియన్లలో సభ్యత్వం కావాలంటే పెద్ద మొత్తం చెల్లించాలి. పని దొరికాక రోజువారీ వేతనాల్లోంచి కొంత డబ్బు చెల్లించుకోవాలి12 గంటల పని గంటల్లో ఉదయం 5 గంటలకే సిద్ధంగా అవ్వాలి. సాయంత్రం 6.20 గంటల వరకు డ్యూటీ చేయాలి. తర్వాత కూడా షూటింగ్ కొనసాగితే నిర్మాత అదనపు భత్యం చెల్లించాలి. ఇక టిఫిన్లు, లంచ్, డిన్నర్, స్నాక్స్, టీలు, కాఫీలు అన్నీ సదుపాయాలు ఉంటాయి. కానీ, అడ్డా మీద కూలీకి సినీ కార్మికులకు చాలా తేడా ఉంది. అడ్డా కూలీ తన క్యారియర్ తను తెచ్చుకుంటాడు. లంచ్ బ్రేక్ మినహా ఇంకే బ్రేక్ ఉండదు. వేతనం కూడా 800 నుంచి 1200 లోపు ఉంటుంది. సినీ కార్మికులది అలా కాదు.. ఫుడ్, మధ్య మధ్య బ్రేకులు, వేతనం కూడా వెయ్యి నుంచి పది వేల వరకు ఉంటుంది. వారి వారి స్థాయి నైపుణ్యం బట్టి వేతనం మారిపోతూ ఉంటుంది. చెప్పాలంటే సాస్ట్వేర్ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోదు అంటారు

నిర్మాతే కీలకం, కానీ!

ఇక సినిమాకు నిర్మాతే కీలకం. నిర్మాత లేనిదే సినిమా లేదు. ఒక సినిమా సెట్పైకి రావాలంటే.. హీరో కాల్షీట్దొరికి కోట్లు ఇవ్వడం నుంచి మంచి దర్శకుడిని పట్టుకుని కథ సిద్ధం చేసుకుని.. సంగీతం సమకూర్చకుని షూటింగ్కి సిద్ధం అయితేనే కార్మికులకు పని దొరుకుతుందికానీ, యూనియన్ల అడ్డదిడ్డ నిర్ణయాలతో నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏడాదికి పదిశాతం అంటే లెక్కన మూడేళ్లకు 30 శాతం వేతనం కార్మికులకు పెంచాలని ఫెడరేషన్నిబంధన నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. యూనియన్లకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. ఒకవేళ కార్మికుల సమ్మెకు వెళ్లాలంటే ముందస్తుగా నోటీసు ఇవ్వాలి. కానీ, అవేవి లేకుండా రాత్రికి రాత్రి సమ్మెకు ఫెడరేషన్ పిలుపు ఇవ్వడంతో షూటింగులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. యూనియన్ల ఆకస్మిక నిర్ణయం నిర్మాతలను ఆగ్రహనికి గురి చేసింది. చర్చలు జరుగుతున్న వేళ సమ్మెకు పిలుపునిచ్చి నష్టం కలిగించారన్న ఆవేదనలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.

కార్మిక శాఖ కార్యదర్శితో చర్చించి నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇక యూనియన్లతో సంబంధం లేదని, నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల కార్మికుల్లో అధిక శాతం మంది హర్షం వ్యక్తం చేశారుకానీ, కానీ నేతలకు భయపడి బయట పడటం లేదట. నిజానికి ఈ సమ్మె వెనుక పెద్ద కుట్ర కోణం కనిపిస్తోందనేది ఎంతోమంది అభిప్రాయం. కార్మికులను అడ్డు పెట్టి చిత్రపురి మాఫియా ఆధిపత్యం పెంచుకునేందుకు సమ్మె అని కొందరు సినీ పండితులు అంటున్నారు. ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్లో ముదురు నేతలు కొందరు చేసిన కుట్ర ఫలితమే కార్మికులకు ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. చిత్రపురి కాలనీలో భారీ టవర్లకు అనుమతి తెచ్చుకున్నార. ఎన్నికలు లేకుండా ఆయా యూనియన్లలో కొనసాగుతున్న దోపిడీ నేతలు మరింత దోచుకోవడానికి, తమ అధిపత్యాన్ని చాటుకునేందుకు వేసిన ఎత్తుగడల్లో ఇప్పుడు బొక్కా బోర్లాపడ్డార. ఇప్పటికైనా ఆయా పదవులకు రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రపురి సిత్రాలు ఇంకే విధంగా రూపుదాలుస్తాయో చూడాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×