BigTV English

Jr.NTR: నాకు అలా బ్రతకడమే ఇష్టం… కుటుంబ వారసత్వం పై ఎన్టీఆర్ కామెంట్స్!

Jr.NTR: నాకు అలా బ్రతకడమే ఇష్టం… కుటుంబ వారసత్వం పై ఎన్టీఆర్ కామెంట్స్!

Jr.NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి(Nandamuri Family) ఎంతో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. నందమూరి కుటుంబం నుంచి ఎన్టీరామారావు నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చినప్పటికీ బాలకృష్ణ (Balakrishna)మాత్రం ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తదుపరి జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), కళ్యాణ్ రామ్ వంటి వారు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఈయన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేస్తున్నారు.


వర్తమానంలో బ్రతకడమే ఇష్టం..

ఇక త్వరలోనే ఎన్టీఆర్ నటించిన వార్ 2 (War 2)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఓ సందర్భంలో ఎన్టీఆర్ తన లైఫ్ స్టైల్ గురించి అలాగే కుటుంబ వారసత్వం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చాలామంది హీరోలు రేపటి గురించి ఆలోచించి బ్రతుకుతూ ఉంటారు కానీ నాకు అలా బ్రతకడం ఇష్టం ఉండదని ఎన్టీఆర్ తెలియజేశారు. నాకు ఎప్పుడు వర్తమానంలో బ్రతకడమే ఇష్టమని ఈయన వెల్లడించారు.


భవిష్యత్తు కోసం ఆలోచించను..

భవిష్యత్తు గురించి తాను ఎలాంటి ప్రణాళికలు వేసుకోనని తెలిపారు. అభిమానులు, ప్రేక్షకులు నన్ను ఎల్లప్పుడూ నేను నటించే సినిమాల ద్వారా మాత్రమే నన్ను గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటానని తెలిపారు. అదేవిధంగా కుటుంబ వారసత్వం గురించి కూడా ఈయన స్పందించారు. కుటుంబ వారసత్వం విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదు, తాను ఎలాంటి ప్రణాళికలు వేసుకోనని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యల గురించి పలు సందర్భాలలో కూడా ప్రస్తావించారు తాను రేపటి కోసం అసలు ఆలోచించచని రేపు తెల్లవారే సరికి మనం బ్రతుకుతామో లేదో కూడా తెలియని విషయం గురించి ఆలోచించడం ఎందుకు అంటూ పలు సందర్భాలలో తెలియచేశారు.

మొదటిసారి బాలీవుడ్ సినిమా…

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఎన్టీఆర్ కలిసి నటించన వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా విభిన్న రీతిలో సినిమాని ప్రమోట్ చేస్తూ పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.

Also Read: HBD Kajol: పుట్టినరోజు స్పెషల్.. నటి కాజోల్ నికర ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×