E-Paper
Advertisement

బిగ్ బాస్‌లోకి ఉప్పల్ బాలు? హౌస్ ఇక రచ్చ రచ్చే!

బిగ్ బాస్‌లోకి ఉప్పల్ బాలు? హౌస్ ఇక రచ్చ రచ్చే!
Advertisement

Uppal Balu: ఉప్పల్ బాలు …సోషల్ మీడియాని వాడే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. తనదైన ఎక్స్ప్రెషన్స్ తో, వాయిస్ తో బాగా పాపులర్ అయిన బాలు వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంతగిరి ఘాట్ రోడ్డుపై థార్ కార్ పై ఎక్కి చేసిన స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే.దీంతో ప్రసిద్ద పుణ్య క్షేత్రంలో ఈ ఆటలు ఏంటి అంటూ, ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు కూడా.

అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించాడు ఉప్పల్ బాలు.ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ వెన్నచేడు మా ఊరని,అక్కడ లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని,పెట్టిస్తున్నానని, అందులో భాగంగా అన్నదానం కూడా చేయిస్తున్నాని.. అయితే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయి జులై 5 కి పోస్ట్ పోన్ అయిందని తెలిపాడు.
ఇక తన సొంత ఊరికి చాలా రోజుల తర్వాత వెళ్ళడంతో సెలెబ్రిటి అయ్యాక అసలు రావడం లేదని అనడంతో వారిని కలిసి తనకి ఇష్టమైన దేవుడి గుడిని దర్శించుకుని వెళ్లామని అలా కాస్త ముందుకు వెళ్ళగా అక్కడ ఘాట్ రోడ్ ప్లేస్ మంచిగా అనిపించడంతో మా బావ కొత్త కార్ లో అలా సరదాగా స్టంట్స్ చేశామని తెలిపాడు.

Advertisement

also read:జానపదాల జాతర నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా.. ఎవరీ నాగదుర్గ?

నన్నెవరు అరెస్ట్ చేయలేదు 

ఇక దాన్ని చూసి చిన్న పిల్లలు ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి సమాధానంగా అసలు నేను వేరేదేమీ ఆలోచించలేదని, కేవలం ఆ సమయంలో మాకు ఆ ఆలోచన వచ్చింది కాబట్టే అలా చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా చేయడం తప్పుకాదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికి ఇలా ఎంత మంది చేయలేదని,కొంతమంది అయితే ఏకంగా చేతులు వదిలేసి పోటీలు పడుతూ మరీ రేసులల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చాడు.ఇక పొలిటికల్ లీడర్లు కూడా అప్పుడప్పుడు ఇలానే చేస్తుంటారని,తనని తాను సమర్దించుకున్నాడు. అయితే ఇలా పోలీసులు కేసులు పెడతారన్న విషయం తెలీదా అన్న ప్రశ్నకి సమాధానంగా నాకు అదేమీ తెలీదని, ఇక ఇప్పటి వరకు నన్నెవరు అరెస్ట్ చేయలేదని తెలిపాడు.

బిగ్ బాస్ 10 కి సెలెక్ట్ చేసెలా

Advertisement

ఇక తాను వికారాబాద్ గుడికి వెళ్ళిందే తను బిగ్ బాస్ 10 కి సెలెక్ట్ చేసెలా చేయ్యుమని మొక్కుకునేందుకు అంటూ మనసులోని మాటని బయటపెట్టాడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్.ఇక బాలు ఇలా ఇంటర్వ్యూలో తన మాటని బయట పెట్టాడో లేదో సోషల్ మీడియాలో బాలుకి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఒకవేళ ఉప్పల్ బాలు గనుక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే రచ్చ మాములుగా ఉండదని, అందరిని వెనక్కి నెట్టి ఉప్పల్ బాలుయే విన్నర్ అవడం పక్కా అంటూ మరికొంతమంది ఆకాశానికి ఎత్తేస్తున్నారు .చూడాలి మరి ఎన్నో ఏళ్లుగా బిగ బాస్ పై దండయాత్ర చేస్తున్న బాలు ఈ సరైనా సక్సెస్ అవుతాడో లేదో !

Related News

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హంగామా.. టాలీవుడ్ రెడీ!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

Big Stories

Advertisement
×