BigTV English

OG Glimpse: హైప్‌ పెంచుతున్న ‘ఓజీ’ గ్లింప్స్‌.. పవన్‌ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?

OG Glimpse: హైప్‌ పెంచుతున్న ‘ఓజీ’ గ్లింప్స్‌.. పవన్‌ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?

OG Movie Glimpse: మెగా, పవర్‌ స్టార్‌ అభిమానులంత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. పవన్‌ బర్త్‌డే సందర్భంగా ఓజీ మూవీ టీం ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇవాళ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ విడుదల చేసి అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చింది. కాగా పవన్‌ కళ్యాణ్‌ మోస్ట్‌ అవైయిట్‌ చిత్రాల్లో ఓజీ ఓకటి. సెప్టెంబర్‌ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మంగళవారం పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్‌డే ఓజీ- లవ్‌ ఓమీ.. (HBD OG – LOVE OMI) అంటూ గ్లీంప్స్‌ వదిలారు మేకర్స్‌. ఈ వీడియో కట్‌లో సుజీత్‌ మార్క్‌ కనిపించింది.


హ్యాపీ బర్త్ డే ఓజీ.. మీ ఓమీ

‘డియర్‌ ఓజీ.. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఆశగా ఎదురుచూస్తున్నా.. నీ ఓమీ’. అనంతరం హ్యాపీ బర్త్‌డే ఓజీ అంటూ విలన్‌ చేత.. పవన్‌కి బర్త్‌డే విషెస్‌ చెప్పించాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. చివరిలో పవన్‌ లుక్‌.. అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. వైట్‌ షర్ట్‌లో తళ్వార్‌తో ఓజీ స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్‌ అంతా పండగా చేసుకుంటున్నారు. పవన్‌ బర్త్‌డే కు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్‌ గిఫ్ట్‌ ఇచ్చావంటూ దర్శకుడు సుజీత్‌ని కొనియాడుతున్నారు.


కాగా సాహో ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ప్రతికథానాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈగ్లింప్స్‌తో ఆయన పాత్ర రివీల్‌ అయ్యింది. ఇందులో ఇమ్రాన్‌ ఓమీ అనే విలన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. తెరపై వీరిద్దరి మధ్య యాక్షన్‌ ఓ రేంజ్ లో ఉండబోతుందని గ్లింప్స్‌ చూస్తే అర్థమైపోతుంది. హీరో, విలన్‌ పాత్రల మధ్య హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఉండబోతుందని, బిగ్‌స్క్రీన్‌పై వీరిద్దరు కనిపిస్తే భీభత్సమే అంటున్నారు. మొత్తానికి పవన్‌ బర్త్‌డేకు సుజీత్‌ గ్లింప్స్‌తో ట్రీట్‌ ఫిస్ట్‌ ఇచ్చాడు.

బొమ్మ బ్లాక్ బస్టర్

ఇప్పటికే ప్రచార పోస్టర్స్‌, పాటలతో మూవీపై భారీ బజ్‌ నెలకొంది. ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్‌ మూవీపై మరింత హైప్‌ పెంచుతోంది. ఈ గ్లింప్స్‌ ఒక్కసారిగా ఓజీ బోమ్మపై క్లారిటీ వచ్చేసిందంటున్నారు. సెప్టెంబర్‌ 25న బొమ్మ బ్లాక్‌ బాస్టరే అంటూ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగిరేస్తున్నారు. కాగా ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాష్‌ రాజ్ వంటి తదితర స్టార్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కాగా ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. ముంబైకి చెందిన పవర్పుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆయనకు ప్రత్యర్థిగా మరో గ్యాంగ్‌స్టర్‌ ఇమ్రాన్‌ హష్మీ ప్రతి కథనాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Also Read: OG Movie: ఓజీ.. ఆ చిత్రాల కాపీనా.. హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే ?

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×