BigTV English

U.V Creations: యు.వి. క్రియేషన్స్ పేరుతో ఫ్రాడ్ కాల్స్.. హీరోయిన్స్ టార్గెట్!

U.V Creations: యు.వి. క్రియేషన్స్ పేరుతో ఫ్రాడ్ కాల్స్.. హీరోయిన్స్ టార్గెట్!

U.V Creations: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు గాంచిన నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థలలో ఒకటైన యు.వి. క్రియేషన్(U.V. Creations) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ నిర్మాణ సంస్థను ప్రభాస్ సన్నిహితులు, ఆయన సోదరుడు నడుపుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా యువిక్రియేషన్స్ వారు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.


హీరోయిన్లకు ఫ్రాడ్ కాల్స్..

ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి హీరోయిన్లను ట్రాప్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన నిర్మాణ సంస్థ అధికారక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దాని ప్రకారం మా సంస్థ పేరు వాడుకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిధి అని చెప్పుకుంటూ హీరోయిన్లకు ఫ్రాడ్ ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే హీరోయిన్లకు మా సంస్థల అవకాశం కల్పిస్తున్నాము అంటూ ఫోన్ కాల్స్ ద్వారా హీరోయిన్లను టార్గెట్ చేశారు.


మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు…

ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేయదలుచుకున్నాము. ఆ వ్యక్తికి మా సంస్థకు ఏమాత్రం సంబంధం లేదని తెలియజేశారు.మా సంస్థ నుంచి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వాలనుకున్న, లేదంటే కాస్టింగ్ సంబంధించిన ఏ విషయమైనా కూడా మేము అధికారక ఛానల్ ద్వారా తెలియ చేస్తామని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరారు. ఇలాంటి విషయాల పట్ల నటీనటులు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మా కంపెనీ పేరు ప్రతిష్టలను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

చర్యలు తప్పవు..

నిజంగానే మా సంస్థలో పనిచేయటానికి హీరోయిన్లు అవసరమైతే మేమే అధికారకంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయం పట్ల తాము చాలా సీరియస్ గా ఉన్నామని ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపకపోతే సంబంధిత వ్యక్తుల పట్ల పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోబడతాయి అంటూ నిర్మాణ సంస్థ హెచ్చరిస్తూ విడుదల చేసిన నోట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి అన్ని సర్వసాధారణమని చెప్పాలి. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే హీరోయిన్లను ట్రాప్ చేయడానికి ఇలాంటి ప్రముఖ నిర్మాణ సంస్థల పేర్లను వాడుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో అలర్ట్ అయిన యు.వి నిర్మాణ సంస్థ హెచ్చరించారు. ఇక ఈ నిర్మాణ సంస్థ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి . ఇక త్వరలోనే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Siddarth : పెళ్లి తర్వాత నా బ్రతుకంతా మారింది.. బాధ మొత్తం బయటపెట్టిన సిద్దార్థ్!

Related News

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్‌..

Prabhas: మహాభారతంలోని పాత్రతో ప్రభాస్ మూవీ… డార్లింగ్‌కు సరిగ్గా సెట్!

Big Stories

×