Formula E Race Caseబాసూ.. ఇది.. మామూలు రేసు కాదు.. దానిపై నమోదైంది కూడా నార్మల్ కేసు కాదు.. ఆ ఒక్క రేసుతో.. సర్కారు కోట్లు లాస్ అయింది. అందుకే.. కేస్ అయింది. స్టేట్ మొత్తం ఇంత డిస్కషన్ నడుస్తోంది. లొట్టపీస్ కేసు అని కేటీఆర్ ఎంత మొత్తుకున్నా.. ఏసీబీ మాత్రం పీస్ పీస్‌గా కేస్‌ని ఒలిచి.. ఒలిచి విచారిస్తోంది. ఇప్పటికే.. ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. కేటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. HMDA అకౌంట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్ల నిధుల మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన చెప్పిన విషయాల ఆధారంగానే.. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ని కూడా ప్రశ్నించింది ఏసీబీ.
ఫార్ములా Eకార్ రేస్ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏసీబీ విచారణ చేసింది. 6గంటలపాటు ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఆయన విచారణకు వచ్చారు. ఫార్ములా e కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది.
గతంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ ఆయనపై ప్రశ్నలు కురిపించినట్టు తెలుస్తోంది. అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది.
కేటీఆర్ ఆదేశాలతోనే తాను ఫార్ములా-ఈ రేస్ కోసం నిధులు విడుదల చేశానని చెప్పారు ఐఏఎస్ అర్వింద్ కుమార్. HMDW ఖాతా నుంచి.. FEO కంపెనీకి నిధుల మళ్లింపులో.. తన ప్రమేయం లేదన్నారు. కేటీఆర్.. స్వయంగా వాట్సాప్ ద్వారా FEOకి నిధులు విడుదల చేయాలని ఆదేశించారన్నారు అర్వింద్ కుమార్. ఇందులో.. తనకెలాంటి వ్యక్తిగత స్వార్థం లేదన్నారు. బిజినెస్ రూల్స్, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని.. తాను కేటీఆర్‌కు చెప్పానని.. అయినప్పటికీ.. FEO కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని.. మిగతా విషయాలు తాను చూసుకుంటానని చెప్పారని.. అర్వింద్ కుమార్ వెల్లడించారు. మొత్తం.. 45 కోట్ల 71 లక్షల రూపాయల్ని.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా.. బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామన్నారు.
Also Read: మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు!!
అయితే.. ఈ ఫార్ములా-ఈ రేస్ కేసులో.. అర్వింద్ కుమార్, కేటీఆర్ దోబూచులాట ఆడుతున్నట్లు కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కేటీఆర్ ఏమో ఈ వ్యవహారంలో అర్వింద్ పేరు చెబుతున్నారు. ఆయనేమో.. కేటీఆర్ పేరు చెబుతున్నారు. దాంతో.. ఈ ఫార్ములా పంచాయతీ ఇప్పట్లో తెగుతుందా? అనే డౌట్ కొడుతోంది. అసలు.. ఫార్ములా-ఈ రేసు కేసులో ఏం జరిగింది? కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందా? లేక.. కేటీఆర్ చెబుతున్నట్లు ఇది అర్వింద్ కుమార్ డెసిషనేనా?