Siddarth: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన వారిలో హీరో సిద్దార్థ్(Siddarth) ఒకరు. తమిళ హీరో అయినప్పటికీ ఈయన తెలుగులో బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సిద్దార్థ్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఇటీవల తిరిగి వరుస సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సిద్దార్థ్ హీరోగా నటించిన 3bhk (3BHKMovie)అనే సినిమా జులై 4వ తేదీ విడుదల కాబోతోంది.
పెళ్లి తర్వాత కుక్ గా మారిన హీరో..
ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సిద్దార్థ్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కుక్ విత్ జాతి రత్నాలు(Cook with Jathirathnalu) అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇందులో భాగంగా అందరితో సరదాగా ఈయన గడుపుతూ ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ప్రదీప్(Pradeep) మీరు రెగ్యులర్ గా కుక్ చేస్తారా? అంటూ ప్రశ్న వేశారు. పెళ్లికాకముందు నేను వంట చేసేవాడిని కానీ పెళ్లయిన తర్వాత రెగ్యులర్ గా నేనే వంట చేయాల్సి వస్తుంది అంటూ తెలియచేశారు.
అదితి రావు హైదరితో వివాహం…
పెళ్లి తర్వాత రోజు తానే వంట చేస్తున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ్ ఎలాంటి విషయాలను అందరితో పంచుకున్నారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే. ఇక సిద్దార్థ్ గత కొన్ని నెలల క్రితం నటి అదితీరావు హైదరిని(Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదివరకే పెళ్లి అయినప్పటికీ తన భార్యకు విడాకులు ఇచ్చిన సిద్దార్థ్ తిరిగి అదితి ప్రేమలో పడ్డారు. ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం తర్వాత సిద్దార్థ్ పూర్తి స్థాయిలో కెరియర్ పై ఫోకస్ పెట్టగా అదితి మాత్రం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇక వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటం జరిగింది. ఇక పెళ్లి తర్వాత సిద్దార్థ్ తన నిర్మాణంలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక జూలై 4వ తేదీ విడుదల కాబోతున్న 3bhk సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి ఒక మధ్య తరగతి వ్యక్తి సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం ఎంతలా కష్టపడ్డారనే అంశాలను చూపించబోతున్నారని తెలుస్తోంది.. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి దేవయాని, శరత్ కుమార్ హీరో తల్లిదండ్రులుగా నటించగా హీరోయిన్ గా మీథా రఘునాథ్ (Meetha Raghunath) నటించిన సందడి చేశారు.
Also Read: Ramayan: రామాయణ గ్లింప్స్.. ప్రభాస్ డైరెక్టర్ చావుకొచ్చిందే.. జీవితకాలం విమర్శలు తప్పవా?