E-Paper
Advertisement

ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము దులిపేస్తున్న రవితేజ!

ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము దులిపేస్తున్న రవితేజ!
Advertisement

Irumudi Movie:మాస్ మహారాజా తన ట్యాగ్ పక్కన పెట్టి సక్సెస్ కోసం జానర్ మార్చి ‘ఇరుముడి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ థ్రిల్లర్ తోపాటు డివోషనల్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతి కలిగిస్తోందనే కామెంట్లు సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. శివ నిర్వాణ (Siva nirvana) దర్శకత్వంలో ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ గా.. రవితేజ(Raviteja ) హీరోగా బేబీ నక్షత్ర (Nakshatra) చిన్నారి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటిరోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది? జానర్ మార్చిన రవితేజకు ఈ సినిమా కలిసొచ్చిందా? తదితర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రవితేజ ఇరుముడి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

ఇరుముడి సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.14.80 కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.15 కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా.. ఇక కర్ణాటక నుండి 1.5 కోట్లు రాగా, తమిళనాడు నుండి రూ.34 లక్షలు, మిగతా ప్రాంతాల నుండి రూ.36 లక్షలు వసూల్ అయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ రూ.17.20 కోట్లకు చేరింది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి రూ.7 కోట్ల రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్లకు చేరింది. మొత్తానికైతే గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజా కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు.

Advertisement

also read:అన్నయ్య పుట్టినరోజు స్పెషల్.. ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు ఏం చేశారంటే?

ఇరుముడి మూవీ స్టోరీ విషయానికి వస్తే..

ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో.. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ ఇరుముడి సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సీలేరు పరిసరాల్లోని ఒక ప్రశాంతమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ భార్య కావేరి (ప్రియా భవాని శంకర్) , కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో సంతోషంగా జీవించే వ్యక్తి త్రినాథ్ (రవితేజ). అయ్యప్ప భక్తుడిగా క్రమశిక్షణతో ఉండే అతనికి కుటుంబమే సర్వసం. అయితే ఆ ప్రాంతంలో స్కూల్ కి వెళ్లే కొందరు బాలికలు అనుమానాస్పద స్థితుల్లో ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతుంది. ఈ సంఘటనలకు సంబంధించిన ఒక కీలక విషయం త్రినాథ్ కూతురికి తెలియడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత తన బిడ్డతో పాటు గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు త్రినాథ్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈమె వారం ముగిసేలోపు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×