E-Paper
Advertisement

అన్నయ్య పుట్టినరోజు స్పెషల్.. ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు ఏం చేశారంటే?

అన్నయ్య పుట్టినరోజు స్పెషల్.. ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు ఏం చేశారంటే?
Advertisement

Nagababu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi ) పుట్టిన రోజు ఈ రోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఎక్కడ చూసినా చిరంజీవి అభిమానులు ఆయన కటౌట్ లకు హారతులు ఇస్తూ టెంకాయలు కొడుతూ పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చిరంజీవి పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యులు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలిచింది.

అన్నయ్య పుట్టినరోజు.. మొక్కలు నాటిన నాగబాబు..

తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో హైదరాబాదులోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు నాగబాబు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబ వాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ.. ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు పది నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించి , చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసన భరితమైన పూలను పూస్తుందని నాగబాబు స్పష్టం చేశారు.

అన్నయ్య పుట్టినరోజు పై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్..

Advertisement

ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుక గురించి నాగబాబు మాట్లాడుతూ.. “అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును ఇస్తూ అందరికీ మేలు చేసే ఒక చెట్టు నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది. హ్యాపీ బర్తడే అన్నయ్య. ఈ చెట్ల లాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి” అంటూ తన అన్నయ్యకు స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

also read:పట్టాలెక్కి ఆగిపోయిన చిరంజీవి చిత్రాలు..లిస్ట్ పెద్దదే!

కుటుంబ సభ్యుల పేరుతో 120 కి పైగా మొక్కలు..

Advertisement

నాగబాబు మాట్లాడుతూ..” కుటుంబ సాంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ , వరుణ్ తేజ్ , రామ్ చరణ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితర కుటుంబ సభ్యుల పేర్లతో సుమారుగా 120కి పైగా మొక్కలు నాటినట్లు నాగబాబు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి ప్రియమైన వారి ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొక్కలు నాటాలి” అంటూ ఆయన పిలుపునిచ్చారు.

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×