E-Paper
Advertisement

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్
Advertisement

Salman Khan Wedding Video :సల్మాన్ ఖాన్ ..ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని ఎవరున్నారనే టాపిక్ వస్తే అందరి వేళ్ళు ఈ స్టార్ హీరో వైపే తిరుగుతాయి .అలాంటి సల్మాన్ పెళ్లి పీటలు ఎక్కేశాడు.ఏంటి షాక్ అవుతున్నారా ..? సల్లూ భాయ్ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా పెళ్లి పీటలు ఎక్కేశాడని గుర్రుగా ఉన్నారా ?ఇంతకీ సల్లూ భాయ్ ని పెళ్లి చేసుకున్న ఈ అదృష్టవంతురాలు ఎవరని తెగ ఆలోచిస్తున్నారా ?అయితే చూసేద్దాం రండి .

సల్లూ భాయ్ పెళ్లి అయింది.అది నిజమే

అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సల్లూ భాయ్ పెళ్లి అయింది.అది నిజమే .కానీ అది నిజంగా కాదు .ఏంటి కన్ఫ్యూజన్ గా ఉందా ..సల్లూ భాయ్ పెళ్లి జరిగింది ఎక్కడో ఫంక్షన్ హాల్లోనో ,రిసార్ట్ లోనో కాదు AI లో .అవును ..ఇప్పటికే స్పైడర్ మ్యాన్ జంట టామ్ హాలండ్, జెండయాల పెళ్లిని వాళ్ళకే తెలీకుండా చేసిన ఔత్సాహిక నెటిజన్లు సల్లూ భాయ్ పెళ్లిని కూడా ఇప్పుడున్న AI టెక్నాలజీని వాడి అంగరంగ వైభవంగా చేసేశారు.

Advertisement

ఇక సల్లూ భాయ్ తో మూడు ముళ్ళు వేయించుకున్న ఆ ఆమ్మాయిని రివీల్ చేయకుండా పూలతో కవర్ చేసి కాంట్రవర్సీ నుండి సైలెంట్ గా స్కిప్ అయ్యారు సదరు నెటిజన్లు.దీంతో ఇంతకీ సల్లూ భాయ్ పక్కన ఉండే అవకాశం ఇప్పుడున్న వారిలో ఎవరికుందా అంటూ జుట్టు పీక్కునే పనిలో పడ్డారు సగటు సినీ ప్రేక్షకులు.

తరలి వచ్చిన ఇండియన్ సినీ ఇండస్ట్రీ

ఇక ఈ పెళ్లికి వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఏకంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీనే తరలి వచ్చిందండోయ్ .అవును ..వీరిలో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్లు ఎంతో ఉత్సాహంగా సన్నాయి వాయిస్తుంటే, డాన్స్ ఐకాన్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు తమ అదిరిపోయే స్టెప్పులతో వేదికను హోరెత్తించారు. ఇక మన టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునలతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే తమిళ, కన్నడ, మలయాళ రంగానికి చెందిన అగ్ర హీరోలంతా సల్మాన్‌ను ఆశీర్వదిస్తున్న విజువల్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

Advertisement

వీడియో చివర్లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెలు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ సందడి చేయడం చూస్తుంటే AI టెక్నాలజీని మనోళ్లు ఏ రేంజ్ లో ఉతికి ఆరేస్తున్నారో అర్థమవుతుంది.

సర్దుకుపోతున్న సల్లూ భాయ్ ఫాన్స్

నిజానికి సినిమాల్లో సల్మాన్ పెళ్లి కాన్సెప్ట్ ఎప్పుడూ పెద్ద హిట్. 1994లో వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ నుంచి 1999నాటి ‘హమ్ సాత్ సాత్ హైన్’, 2005లో వచ్చిన ‘మైనే ప్యార్ క్యూ కియా’, 2007 నాటి ‘సలామ్ ఏ ఇష్క్’, అలాగే 2011 లో విడుదలైన ‘రెడీ’ వరకు ఆయన సినిమాల్లో పెళ్లి అనేది కంపల్సరీ అయిపొయింది,కానీ రియల్ లైఫ్ లోనే పెళ్లి ఆయనకు బద్ద శత్రువులా అయిపొయింది.దీంతో రియల్ లైఫ్ లో సల్లూ ఎలాగో పెళ్లి చేసుకునేలా లేదు.కనీసం ఈ వీడియో అయినా చూసి పెళ్లి అయినట్టు ఊహించుకుని మురిసిపోతామంటూ సర్దుకుపోతున్నారు సల్లూ భాయ్ ఫాన్స్.

బాలీవుడ్ చరిత్రలో పెద్ద సంచలనాలు

ఇక సల్లూ లవ్ స్టోరీస్ విషయానికి వస్తే ..గతంలో సంగీతా బిజ్లానీతో పెళ్లి కార్డులు ప్రింట్ అయ్యాక రద్దవ్వడం, ఆ తర్వాత సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్, లూలియా వంతూర్ వంటి భామలతో సాగిన ప్రేమాయణాలు బాలీవుడ్ చరిత్రలో పెద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెల్సిందే.

ALSO READ:ఈశ్వర్ సాయి వైఫ్ కామెంట్స్‌పై శేఖర్ వైరస్ సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పకపోతే అంతే!

మొత్తానికి కలలో అయినా సల్లూ భాయ్ పెళ్లి అవుతుందా అని బెంగ పెట్టుకున్న అభిమానుల కోరికని AI టెక్నాలజీ ఇలా నెరవేర్చిందన్న మాట !

Tags

Related News

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×