Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఇకపోతే నాలుగు దశాబ్దాల కెరియర్ లో ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్లతో పాటు ఫ్లాప్స్ ,ఘోరమైన డిజాస్టర్ లను కూడా ఆయన చవిచూశారు. అయినా సరే తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకుంటూ ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి చిరంజీవి ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చిరంజీవి పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాంటి వాటిలో చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన చిత్రాలు.
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రకటించిన తర్వాత ఆగిపోతే.. మరికొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోయాయి.. అయితే కారణాలు ఏవైనా సరే చిరంజీవి కెరియర్ లో కూడా ఏకంగా 10కి పైగా సినిమాలు క్యాన్సిల్ అవడం గమనార్హం. మరి చిరంజీవి కెరీర్ లో ఆగిపోయిన ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోకవీరుడు అనే పేరుతో ఒక మూవీ ప్లాన్ చేశారు. చిరంజీవి హీరోగా , అశ్వినీ దత్ నిర్మాతగా కూడా ఫిక్స్ అయ్యారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. కానీ షూటింగ్ మొదలు పెట్టకముందే ఈ చిత్రం ఆగిపోయింది.. ఆ తర్వాత కాస్త మార్చి జగదేకవీరుడు అతిలోకసుందరిగా ఉపయోగించుకున్నారనే టాక్ అప్పట్లో ఇండస్ట్రీలో నడిచింది. ఇక ఒకానొక సమయంలో తెలుగులో దొంగ అనే పేరు టైటిల్ లో ఉండేలా ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి చిత్రాలు కూడా వీటిలో చాలా ఉన్నాయి. అయితే సురేష్ కృష్ణ దర్శకుడిగా చిరుతో బాగ్దాద్ గజదొంగ అంటూ ఒక ప్రాజెక్టు అనుకున్నారు. షూటింగ్ కి ముందే ఒక వివాదం తలెత్తడంతో ఈ సినిమా ఆగిపోయింది.
also read:రెండక్షరాల టైటిల్.. అంచనాలు పెంచేస్తోన్న మెగా హీరోలు!
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘వినాలని ఉంది’ అనే పేరుతో సినిమా మొదలుపెట్టారు. కొంత షూటింగ్ కూడా పూర్తయింది. కానీ రాంగోపాల్ వర్మ పలు హిందీ ప్రాజెక్ట్ లతో బిజీ కావడంతో ఈ చిత్రాన్ని ఆపివేశారు. ఇందులో టబు , ఊర్మిళ హీరోయిన్లుగా నటించారు.. ఇకపోతే ఈ చిత్రం కోసం తీసిన పాటలను ఆ తర్వాత చూడాలని ఉంది అనే సినిమా కోసం ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ విజయాలను అందించిన కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా , వజ్రాల దొంగ అనే మూవీ అనుకున్నారు. పైగా హీరోయిన్ శ్రీదేవితో ఒక పాట కూడా తీశారు. అయితే ఆ తర్వాత మధ్యలోనే ఆగిపోయింది. ఇదే దర్శకుడు తో ఇద్దరు పెళ్ళాల స్టోరీ తో ఒక మూవీ అనుకున్నారు. స్క్రిప్ట్ కూడా పూర్తయింది. కానీ అనుకోకుండా సమస్యలు ఏర్పడడంతో అది కూడా ఆగిపోయింది. అంతేకాదు శాంతి నివాసం, పెద్దపులి చిన్న పులి, వడ్డీ కాసుల వాడు ఇలా ఎన్నో చిత్రాలు ప్రకటించి మధ్యలో పలు కారణాల వల్ల ఆగిపోయాయి.