E-Paper
Advertisement

Mega 158 : మెగాస్టార్ బర్త్ డే సర్ప్రైజ్.. ‘కాకా’ నువ్వు కేక..

Mega 158 : మెగాస్టార్ బర్త్ డే సర్ప్రైజ్.. ‘కాకా’ నువ్వు కేక..
Advertisement

Mega 158 : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన విశ్వంభరా సినిమాతో పాటుగా మెగా 158 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీల నుంచి అప్డేట్స్ వస్తాయని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిరంజీవి నటిస్తున్న మెగా 158 చిత్రం నుంచి ఆయన పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియోతో పాటుగా టైటిల్ ను రిలీజ్ చేశారు.. ఆ వీడియో ఎలా ఉంది? టైటిల్ ఏంటి? అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

‘కాకా’ టైటిల్ ఫిక్స్..

మెగాస్టార్ చిరంజీవి కొల్లి బాబీ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం మెగా 158. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్నీ సొంతం చేసుకుంది.. ఈ మూవీ పై అంచనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మెగాస్టార్ బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. దాంతో పాటుగా టైటిల్ కూడా రీవిల్ చేశారు.. రొయ్యలు పెంచే ఒక ఫామ్ లో చిరంజీవి హెడ్ గా పని చేస్తున్నాడని ఆ వీడియోని చూస్తే అర్థమవుతుంది.. అందరితో సరదాగా ఉంటూ పని చేయించుకుంటున్న అతని పేరు సత్యం. ఈ మూవీకి కదిరి అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ బాబీ మాత్రం డిఫరెంట్ గా ఆలోచించి ‘కాకా ‘అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ మూవీలో చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాసేపటి క్రితం విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా గ్రెండ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి స్టోరీ తో రాబోతుందో చూడాలి..

చిరంజీవి లుక్ కేక..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. మెగా 158 సినిమా నుంచి అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన అభిమానులకి డైరెక్టర్ బాబి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. సత్యం క్యారెక్టర్ లో చిరంజీవి నటిస్తున్నాడు.. గతంలో చేసిన సినిమాలు అన్నీ కూడా డిఫరెంట్ లుక్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీలో కూడా చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.. కళ్ళజోడు పెట్టుకుని చాలా స్టైల్ గా ఉండంతో మెగా అభిమానులు చిరంజీవి లుక్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన వీడియో ప్రస్తుతం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయడంతో సినిమా అదిరిపోయేలా ఉంటుంది అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి బాబి చిరు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా మరోసారి హిట్ టాక్ ను అందుకుంటుందేమో చూడాలి..

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×