E-Paper
Advertisement

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!
Advertisement

Jailer 2 First Single: జైలర్ సినిమా చాలు .. రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ పై ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి.బాక్సాఫీస్ వద్ద ఏకంగా 600 కోట్లు కొట్టింది మరి.మరి అలాంటి కాంబోలో సినిమా ..అది కూడా జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ కి సీక్వెల్ అంటే ఇక చెప్పక్కర్లేదు.ఇపుడు ఆ ‘జైలర్ 2’పైనే అటు ట్రేడ్ వర్గాల్లో,ఇటు అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి.ఇక తాజాగా సన్ పిక్చర్స్ పై వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అల బొలెలో’ను ఘనంగా రిలీజ్ చేసి తలైవా ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేసింది మూవీ టీమ్.

స్వయంగా పాడిన అనిరుధ్

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ట్యూన్ కట్టి స్వయంగా పాడిన ఈ మాస్ నంబర్‌కు దర్శకుడు అరుణ్‌రాజా కామరాజ్ అదిరిపోయే లిరిక్స్ అందించారు. అయితే ఈ పాటలో కేవలం మ్యూజిక్ మాత్రమే కాకుండా, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అందించిన క్రేజీ స్టెప్పులు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.

ఎనర్జిటిక్ డ్యాన్స్ తో అదరగొట్టిన పూర్ణ 

Advertisement

ముఖ్యంగా నటి పూర్ణ (షామ్నా కాసిం) తన అద్భుతమైన ఎనర్జిటిక్ డ్యాన్స్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటకు సరికొత్త గ్లామర్, జోష్ తెచ్చిపెట్టింది.ఇక ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించడంపై పూర్ణ ఆనందం వ్యక్తం చేస్తూ, రజినీ సర్ సినిమాలో నటించాలనే తన కల నెరవేరిందని, ఈ అవకాశం ఇచ్చిన నెల్సన్, అనిరుధ్, జానీ మాస్టర్‌లకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కూడా.

అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ 

ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్‌ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్ళింది.ఏప్రిల్‌లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తేవడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

Advertisement

2023లో వచ్చిన మొదటి భాగం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత రజినీకాంత్ నుంచి వస్తున్న మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ బిజినెస్ జరుగుతోంది. ఏది ఏమైనా అక్టోబర్ 15న తలైవా బాక్సాఫీస్ వేటతో థియేటర్లలో విజిళ్లు, పూనకాలు ఖాయమని అంచనాలు చూస్తేనే అర్థమవుతుంది.

Tags

Related News

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×