Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒక్క ఈ కుటుంబం నుంచే దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా వారందరూ కూడా ఎవరికి వారు తమ స్ట్రాటజీతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ప్రతి హీరో కూడా స్టార్ హోదాను దక్కించుకొని మెగా కాంపౌండ్ అనిపించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మెగా హీరోలు ఇద్దరు కేవలం రెండక్షరాల టైటిల్ కే పరిమితం అవడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. పైగా మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ రెండు భారీ చిత్రాలపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
అలా మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న రెండు ప్రాజెక్టులపై అంచనాలు పెరగగా.. ఆ రెండు సినిమాల టైటిల్స్ కూడా చిన్నగా కేవలం రెండు అక్షరాలతో ఉండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. విషయంలోకి వెళ్తే స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం రాకా (Raaka). ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు పెరగడం గమనార్హం. పైగా ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పైగా అల్లు అర్జున్ నటించిన ఈ రాకా రెండక్షరాలు కావడం గమనార్హం. అలాగే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 158వ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా రిలీజ్ విడుదల చేశారు. ఆ టైటిల్ పేరు కాకా(Kaaka).. ఈ సినిమా కూడా రెండు అక్షరాలతో రాబోతుండడం గమనార్హం. మొత్తానికైతే ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో ఈ సినిమా కూడా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..
also read:షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?
మేకర్స్ తాజాగా మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టైటిల్ ను రివీల్ చేయడమే కాకుండా ఆయన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. అంతేకాదు టైటిల్ రిలీజ్ వీడియో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో సత్యం పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. గతంలో చిరంజీవి చేసిన సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ లుక్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీలో కూడా చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. కళ్ళజోడు పెట్టుకొని చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు చిరంజీవి. ఇందులో సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు
ఇకపోతే చిరంజీవి, బాబి కొల్లి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, అనస్వర రాజన్, మురళీ శర్మ, ప్రియమణి, మోహన్ లాల్, రచిత రామ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్న ఈ సినిమా ఎలాంటి విషయాన్ని అందుకుంటుందో చూడాలి.