E-Paper
Advertisement

హీరో కాకముందే నా హీరో.. చిరంజీవిపై పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

హీరో కాకముందే నా హీరో.. చిరంజీవిపై పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Pawan Kalyan About Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.  చిన్ననాటి నుంచి అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ విషయాలను చెప్పుకొచ్చారు. హీరోగా మారకముందే అన్నయ్య చిరంజీవి తనకు నిజమైన హీరో అని పవన్ కల్యాణ్  చెప్పుకొచ్చారు.

కాలేజీ రోజుల్లో అన్నయ్యతో నడవడమే గర్వం

చిరంజీవి అప్పటికే స్టార్‌గా ఎదుగుతున్న రోజుల్లో ఆయనతో కలిసి నడవడం కూడా తనకు ఎంతో గర్వంగా ఉండేదని పవన్ గుర్తుచేసుకున్నారు. కాలేజీ రోజుల్లో అన్నయ్య పక్కన కనిపించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చేదని తెలిపారు. తెరపై కనిపించే హీరో మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా తనకు అన్నయ్యే ఆదర్శమని చెప్పారు. అన్నయ్య తన మొదటి సింగపూర్ పర్యటన నుంచి ఇంటికి వచ్చినప్పుడు తెచ్చిన బహుమతులు ఇప్పటికీ గుర్తున్నాయని పవన్ తెలిపారు. ఒక బ్లూ బ్యాగ్‌ లో లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, కామిక్ పుస్తకాలు, మ్యూజిక్ క్యాసెట్లు సహా ఎన్నో కానుకలు తీసుకొచ్చారని చెప్పారు. ఆ బహుమతులు ఇంట్లో చిన్నారులందరికీ ఎంత ఆనందం ఇచ్చాయో గుర్తుచేసుకున్నారు.

అన్నయ్య పెళ్లి రోజు కంటతడి!  

Advertisement

అన్నయ్యకి పెళ్లి అవుతుందనే విషయం తెలిసినప్పుడు, తమకు ఆయన దూరమవుతారేమోనని భయపడి గదిలో ఏడ్చిన సంఘటనను కూడా పవన్ పంచుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి తనను దగ్గరకు తీసుకుని, వదినను చూపిస్తూ.. “రా, నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తా” అంటూ నవ్వించిన విషయం ఇప్పటికీ మర్చిపోలేనిదని చెప్పారు. చెన్నైలో కలిసి ఉన్న రోజుల్లో అన్నయ్య పడిన కష్టాన్ని తాను దగ్గరగా చూశానని పవన్ అన్నారు. షూటింగ్‌ లలో గాయపడినా పని ఆపకుండా, మండే ఎండలో గంటల తరబడి శ్రమించి ఇంటికి వచ్చేవారని తెలిపారు. కొన్ని రోజులు 18 గంటల పాటు పనిచేసి, నిలబడే ఓపిక కూడా లేకుండా ఇంటికి చేరుకునేవారని గుర్తుచేశారు.

ఎప్పుడూ నిందించని అన్నయ్య

తన చదువులో వచ్చిన ఫెయిల్యూర్స్, జీవితంలో తాను సరైన దిశలో లేనప్పుడు కూడా చిరంజీవి ఒక్కసారి కూడా తనను నిందించలేదని పవన్ చెప్పారు. అన్నయ్య కష్టాన్ని చూసి తాను మాత్రం చాలా సందర్భాల్లో గిల్టీగా ఫీలయ్యేవాడినని తెలిపారు. కానీ చిరంజీవి ఎప్పుడూ ధైర్యం చెప్పే వ్యక్తిగానే నిలిచారని అన్నారు. అన్నయ్య తన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా స్నేహితులు, నిర్మాతలు, సినీ పరిశ్రమలోని అనేక మందికి అండగా నిలిచారని పవన్ కొనియాడారు. తన ఉదార స్వభావం, కష్టపడే తత్వంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.

అలుపెరగని ప్రయాణానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Advertisement

సూపర్ స్టార్‌గా ఎదగడం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేయడం, పద్మవిభూషణ్ వంటి గౌరవాలు అందుకోవడం వరకు అన్నయ్య ప్రస్థానం ఎంతో గొప్పదని పవన్ అన్నారు. ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగినా మళ్లీ ట్రైనింగ్ తీసుకుని పనిలోకి దిగడం ఆయన పట్టుదలకు నిదర్శనమన్నారు. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు కేవలం ఒక ఫార్మాలిటీ కాదని, తనలాంటి లక్షలాది మందికి చిరంజీవి జీవితం ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుచేసుకునే ప్రత్యేకమైన రోజని పవన్ కల్యాణ్ భావోద్వేగంగా తెలిపారు.

Read Also:మెగాస్టార్ బర్త్ డే సర్ప్రైజ్.. ‘కాకా’ నువ్వు కేక..

Tags

Related News

అన్నయ్య పుట్టినరోజు స్పెషల్.. ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు ఏం చేశారంటే?

పట్టాలెక్కి ఆగిపోయిన చిరంజీవి చిత్రాలు..లిస్ట్ పెద్దదే!

రెండక్షరాల టైటిల్.. అంచనాలు పెంచేస్తోన్న మెగా హీరోలు!

Mega 158 : మెగాస్టార్ బర్త్ డే సర్ప్రైజ్.. ‘కాకా’ నువ్వు కేక..

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

Big Stories

Advertisement
×