E-Paper
Advertisement

బుమ్రా కెరీర్ దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్ కుట్ర‌..PCB స్కెచ్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

బుమ్రా కెరీర్ దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్ కుట్ర‌..PCB స్కెచ్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే
Advertisement

PCB:  మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత కూడా వరుసగా టోర్నమెంట్లు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం అదిరిపోయే టోర్నమెంట్లు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ఆడుతున్న టీమిండియా.. త్వరలో ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో కూడా పాల్గొననుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు కొనసాగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అటు తాజాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును కూడా ప్రకటించింది PCB. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) ను నియామకం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. సీనియర్లు అందరినీ పక్కకు పెట్టి, కొత్త ప్లేయర్లను తీసుకుంది.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

పాకిస్తాన్ కెప్టెన్ గా ఫర్హాన్…PCB అదిరిపోయే ప్లాన్

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( Asian Games 2026 ) నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును ( Pakistan’s T20 squad) తాజాగా ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించారు. ఈ జట్టుకు సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు కొట్టే సాహిబ్‌జాదా ఫర్హాన్… ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. అయితే అనూహ్యంగా సాహిబ్‌జాదా ఫర్హాన్ ను సెలెక్ట్ చేయడం వెనుక పాకిస్తాన్ కుట్ర దాగి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బుమ్రా కెరియర్ నాశనం చేసేందుకు సాహిబ్‌జాదా ఫర్హాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆసియా కప్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో దుమ్ము లేపాడు ఫర్హాన్. ముఖ్యంగా 2025 టి20 ఆసియా కప్ సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు.

గ్రూప్ స్టేజ్ తో పాటు ఆసియా కప్ ఫైనల్ లో కూడా బుమ్రా బౌలింగ్ ను చీల్చి చెండాడాడు సాహిబ్‌జాదా ఫర్హాన్. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతానని చాలా సంద‌ర్భాల్లో కూడా ఛాలెంజ్ విసిరాడు. అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా బుమ్రాకు సరైన మగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ నే అంటూ రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. అయితే ఏషియన్ గేమ్స్ సందర్భంగా కూడా బుమ్రా కెరీర్ నాశనం చేసేలా సాహిబ్‌జాదా ఫర్హాన్ విరుచుకుపడతాడు అన్న ముఖ్య లక్ష్యంతో అతనికి కెప్టెన్సీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

 

 

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×