Varanasi Title: వారణాసి’.. ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమా .ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లలోకి వస్తుందా అని ఎదురు చూడని అభిమాని లేదంటే అతిశయోక్తి కాదు.అయితే కొంత కాలం కిందటే ఈ సినిమా టైటిల్ వారణాసి ని రఫ్’ సినిమా దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డి తన రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌పై ఆల్ రెడీ రిజిస్టర్ చేసి ఉండటం తో అసలు జక్కన్న తన సినిమాకి వారణాసి అనే టైటిల్ ఎలా పెడతాడా అన్న క్యూరియాసిటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఏర్పడింది.
ఇక గతేడాది నవంబరులో సనాతన ధర్మం గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఒక మాస్ ఎమోషనల్ కథతో ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ కూడా వదిలారు కూడా. దీంతో ఎప్పుడో ఒకప్పుడు ఈ టైటిల్స్ పై రచ్చ ఖాయం అనుకున్నారంతా.
కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా
అయితే తాజాగా ఎలాంటి వివాదాలు లేకుండానే ఈ టైటిల్ గొడవ సద్దుమనిగిపోయింది.అవును..కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన వద్ద ఉన్న టైటిల్ ని వారణాసి ప్రొడ్యూసర్ kl నారాయణ కి అప్పగించేశాడు డైరెక్టర్ సుబ్బారెడ్డి.ఇక విషయంలో ర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది.
ఇక ఇదే విషయమై సుబ్బారెడ్డి మాట్లాడుతూ తన అభిమాన హీరో మహేష్ బాబు, విజనరీ డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలసి చేస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌కు తన వంతుగా టైటిల్ ఇవ్వడాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు .తెలుగు సినిమా గౌరవాన్ని, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.ఇక ఈ టైటిల్ ని తాను కేవలం కమర్షియల్ యాంగిల్ లో చూడకుండా ఒక మంచి, గొప్ప సినిమా కోసం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపాడు సుబ్బారెడ్డి.
also read :30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్!
ఇలా తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచే ప్రయత్నంలో ఉన్న జక్కన్నకి తన టైటిల్ ఇవ్వడం నిజంగా మంచి నిర్ణయమని, ఇది ఇండస్ట్రీలో ఒక మంచి, ఆరోగ్యకరమైన సాంప్రదాయానికి దారి తీస్తుందని ప్రశంసించారు డైరెక్టర్ వీర శంకర్ ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో మరో ఎత్తుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు.
సుబ్బారెడ్డిని నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే
ఇక ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే, ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే అత్యంత పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘RRR’ (2022) వంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై రూపొందుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
also read :ఒకే హీరోకి కూతురిగా, లవర్‌గా, తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇక రాజమౌళి గత చిత్రాల రికార్డులను తిరగరాసేలా ఈ గ్లోబల్ అడ్వెంచర్ ఉండబోతోందని ఏంటో ఆశతో ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.ఏది ఏమైనా పేరులోనే అంతా ఉంది అనుకుంటున్న ఈరోజుల్లో అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ కి ఎలాంటి డబ్బుని ఆశించకుండా తన టైటిల్ ని ఇచ్చిన డైరెక్టర్ సుబ్బారెడ్డిని నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే.