E-Paper
Advertisement

తాడ్‌బండ్ ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య ప్రత్యేక పూజలు..

తాడ్‌బండ్ ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య ప్రత్యేక పూజలు..
Advertisement

Varun Tej – Lavanya : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్యతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఫోటోలు, వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ దంపతులు.. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆ జంటని ఆశీర్వదించారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలను సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు.. ఈ జంట ఆలయంలోకి రావడంతో మెగా అభిమానులు వాళ్లతో ఫోటో దిగేందుకు ఎగబడ్డారు. ఆలయ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించిన జనాలని కంట్రోల్ చేసి వాళ్ళకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి..

సింప్లిసిటీకి కేరాఫ్ గా జోడీ..

వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా జంటగా ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఈవెంట్ తో పాటుగా ప్రత్యేకమైన ప్రదేశాలను సందర్శించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ తన భార్యతో కలిసి ఎక్కువగా ఆలయాలను సందర్శించిన సందర్భాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాడ్‌బండ్ ఆలయాన్ని సందర్శించారు. చాలా సింపుల్ గా గుడికి వచ్చిన ఈ జంటను చూసి అక్కడున్న అభిమానులు ఫీదా అయ్యారు.. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన హీరో అయినా కూడా సదాసీదాగా రావడంతో మెగా అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్..

Advertisement

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్గా నటించిన చిత్రం కొరియన్ కనకరాజు.. ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షోతో కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిన ఈ సినిమా ఆ తర్వాత మంచి కలెక్షన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత కొన్నేలుగా సరైన హిట్ సినిమాలు లేని వరుణ్ తేజ్ కు ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.. అంతేకాదు గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాకు కలెక్షన్లు కూడా వసూల్ అవ్వడంతో ఆయన ఖాతాలో హిట్ సినిమా పడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా వరుణ్ తేజ్ మరో భారీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ రెండు సినిమాల గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.. అటు లావణ్య త్రిపాఠి కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. ఒకవైపు ఫ్యామిలీని లీడ్ చేస్తూనే మరోవైపు సినిమాలు వెబ్ సిరీస్లో చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. నెక్స్ట్ఎలాంటి స్టోరీ తో ఈమె సినిమా చేయబోతుందో అన్నది సస్పెన్స్ గా మారింది..

Also Read :ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Related News

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

సందీప్ కిషన్ సిగ్మా సర్దుకున్నట్టేనా? అసలు లెక్క ఇదే!

శర్వా ‘భోగి ‘కూడా ఆ దారిలోనే వెళ్తుందా?

Big Stories

Advertisement
×