Theater Release : ప్రతి నెల సినీ ఇండస్ట్రీ నుంచి బోలెడు సినిమాలు థియేటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి.. గతవారంతో పోలిస్తే ఈవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పోయిన వారం సూర్య నటించిన విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది. అదేవిధంగా రిలీజ్ అయిన చిన్న పెద్ద సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకున్నాయి.. ఇక ఈవారం కూడా స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఎలాంటి సినిమాలు ఈవారం థియేటర్లలోకి రాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
ఆగస్టు మూడో వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ‘ఇరుముడి’ అందరి అటెన్షన్ డ్రా చేసింది అని చెప్పాలి. డౌట్ లేకుండా ఈ వారం ఆడియన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇదే. దీంతో పాటు చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ‘ముఠామేస్త్రి’ ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ వంటి క్లాసిక్ హిట్స్ కూడా రీ-రిలీజ్ కానున్నాయి. ఇక ఓటీటీల్లో కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి.. ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలు చూద్దాం..
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఖలీఫా.. ఈ సినిమాలో టొవినో థామస్, మాళవిక శర్మ, మోహిని, నీల్ నితిన్ ముఖేష్, ఇంద్రాన్స్, సంజు శివరామ్ తదితరులు నటించారు.. ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. మోహన్ లాల్ ఖాతాలో మరో భారీ హిట్ పడుతుంది అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు 20 న థియేటర్లోకి రిలీజ్ కానుంది..
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడి. టాలీవుడ్ క్రేజ్ డైరెక్టర్ శివ నిర్వాణ దశకత్వంలో దొరికేక్కిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా ప్రియ భవాని నటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముఖ్యంగా మల్లెపూల పల్లకి సాంగ్ ట్రెండ్ అవుతుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..
వీటితో పాటుగా అమీర్ లోగ్, ది రెడ్ బ్యాగ్, చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్, చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమా మరోసారి రీరిలీజ్ కాబోతున్నాయి.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలు మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. వీటితోపాటుగా కొన్ని చిన్న సినిమాలు కూడా అదే రోజున థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాకు ఎలాంటి టాక్ దక్కుతుందో చూడాలి…