E-Paper
Advertisement

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్
Advertisement

Leanne Series on OTT:  ఒక తల్లి తన కుటుంబం గురించి స్టేజ్‌పై జోకులు చెబుతూ అందరినీ నవ్విస్తుంటుంది. కానీ అదే కామెడీ వెనుక తన జీవితంలో దాచుకున్న బాధలు కూడా ఉంటాయి. భర్త నుంచి విడిపోయిన తర్వాత, పిల్లలతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో కథ నవ్విస్తూనే కన్నీళ్ళు పెట్టిస్తుంది.  అమెరికన్ కమెడియన్ లీన్ మోర్గాన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందిన ఈ సిరీస్ పేరు  ‘Leanne’. కుటుంబం, విడాకులు, పిల్లల ఎమోషన్స్, కామెడీతో పాటు జీవితంలో మళ్లీ ఎలా నిలబడాలో చూపించే లైట్‌హార్టెడ్ సిరీస్‌లు ఇష్టపడేవారికి ‘Leanne’ మంచి వీకెండ్ వాచ్.

కథలోకి వెళ్తే…

లీన్‌కు 33 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత భర్త బిల్ మరో మహిళతో వెళ్లిపోవడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. అప్పటివరకు భర్త, పిల్లలు, ఇంటి బాధ్యతలతో గడిచిన జీవితం నుంచి ఇప్పుడు తనకంటూ కొత్త జీవితాన్ని నిర్మించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మార్పును అంగీకరించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒంటరిగా జీవించడం, పిల్లలతో సంబంధాన్ని కొనసాగించడం, తన సోదరి సహాయం తీసుకోవడం లీన్‌కు కొత్త అనుభవాలుగా మారతాయి.

Advertisement

అయితే లీన్ పరిస్థితులను ఏడుస్తూ ఎదుర్కోవడం కంటే, తనకు ఎదురయ్యే ఇబ్బందులనే నవ్వుగా మార్చుకుంటుంది. కుటుంబంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు, విడాకుల తర్వాత ఎదురయ్యే సమస్యలు, పిల్లలతో వచ్చే అపార్థాలు ఆమె కామెడీలో భాగమవుతాయి. బయట ప్రేక్షకులు నవ్వుతున్నా, ఆ జోకుల వెనుక ఒక మహిళ తన జీవితాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం కనిపిస్తుంది.

ఇక పిల్లల విషయానికి వస్తే, తల్లి జీవితంలో వచ్చిన ఈ మార్పులను వాళ్లు కూడా సులభంగా అంగీకరించలేరు. ముఖ్యంగా తల్లి తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఎదుర్కొంటుందో, తండ్రితో ఉన్న సంబంధం ఎలా మారుతుందో వారి జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. మరి లీన్ తన కుటుంబాన్ని కోల్పోకుండా తన కొత్త జీవితాన్ని ఎలా నిర్మించుకుంటుంది? పిల్లలు ఆమె నిర్ణయాలను అర్థం చేసుకుంటారా? భర్తతో ఆమె బంధం పూర్తిగా ముగిసిపోతుందా? లేక గతం మళ్లీ ఆమె ముందుకు వస్తుందా? అనేదే సిరీస్‌లో చూడాల్సిన అసలు ఆసక్తి.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

కామెడీ రైటర్ సుసన్ మెక్‌మార్టిన్, చక్ లోర్రే రూపొందించిన ‘Leanne’లో లీన్ మోర్గాన్, క్రిస్టెన్ జాన్స్టన్, ర్యాన్ స్టైల్స్, గ్రాహమ్ రోజర్స్, హన్నా ఎయిన్‌బైండర్ తదితరులు నటించారు. ఈ సిరీస్ లీన్ మోర్గాన్ స్టాండ్‌అప్ కామెడీ ఇమేజ్ నుంచి స్ఫూర్తి పొందిన ఫిక్షనల్ కథ. ‘Leanne’ మొదటి సీజన్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోలో కూడా ఇది అందుబాటులో ఉంది.

Read Also: పిల్లలను ఎత్తుకెళ్లే సీరియల్ కిల్లర్… 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… తెలుగులో సైకో థ్రిల్లర్ స్ట్రీమింగ్

Tags

Related News

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×