E-Paper
Advertisement

పెళ్లాం, అత్త, ఇద్దరు కూతుళ్లను కాల్చేసిన డాక్టర్… తీరా ఆరా తీస్తే దేశాన్నే షాక్ చేసిన క్రైమ్ స్టోరీ

పెళ్లాం, అత్త, ఇద్దరు కూతుళ్లను కాల్చేసిన డాక్టర్… తీరా ఆరా తీస్తే దేశాన్నే షాక్ చేసిన క్రైమ్ స్టోరీ
Advertisement

True Crime Movie: 1992లో అర్జెంటీనాను కుదిపేసిన రికార్డో బరెడా కుటుంబ హత్యల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా ‘Barreda’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకున్న ఈ సినిమా, ఒక కుటుంబంలో జరిగిన దారుణ హత్యలతో పాటు ఆ తర్వాత సమాజం, మీడియా, న్యాయవ్యవస్థ ఆ నేరాన్ని ఎలా చూసాయనే విషయాన్ని కూడా చూపిస్తుంది. మరి రికార్డో బరెడా అసలు ఏం చేశాడు? దేశవ్యాప్తంగా ఈ కేసు ఎందుకు సంచలనం సృష్టించింది? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1992లో అర్జెంటీనాలోని లా ప్లాటాలో జరిగిన నిజమైన ఘటన చుట్టూ తిరుగుతుంది. రికార్డో బరెడా ఒక సాధారణ డెంటిస్ట్‌గా కనిపిస్తాడు. కానీ ఓ రోజు తన ఇంట్లోనే భార్య, అత్త, ఇద్దరు కూతుళ్లను తుపాకీతో కాల్చి చంపుతాడు. ఆ తర్వాత తాను చేసిన హత్యలను అంగీకరిస్తూనే, తాను ఆ పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం అలా చేశానని చెబుతాడు.

Advertisement

ఇక్కడి నుంచే ఈ కథ మరింత షాకింగ్‌గా మారుతుంది. కోర్టులో బరెడా తరఫు న్యాయవాది అతన్ని బాధితుడిగా చిత్రీకరించడంతో, 1990ల అర్జెంటీనా సమాజంలో కొంతమంది అతనిపట్ల సానుభూతి చూపించడం మొదలుపెడతారు. మీడియా అతని కథను విస్తృతంగా చర్చిస్తుంది. అతని చుట్టూ పాటలు, స్కెచ్‌లు, స్మారక వస్తువులు కూడా తయారయ్యేంతగా పరిస్థితి మారుతుంది. నాలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఈ హత్యల కంటే, హంతకుడి ‘బాధితుడు’ అనే వాదనపైనే ఎక్కువ చర్చ జరగడం ఈ కేసును మరింత కలవరపెట్టేలా చేస్తుంది.

అసలు బరెడా చెప్పిన ఆత్మరక్షణ కథలో నిజమెంత? కుటుంబంలో ఇంతకాలం ఏం జరుగుతోంది? హత్యలకు దారితీసిన అసలు కారణం ఏంటి? నేరం చేసిన వ్యక్తి ఎలా సమాజంలో సానుభూతి పొందగలిగాడు? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు షాక్. నిజమైన కేసును మరో కోణంలో చూపిస్తూ, ఆ కాలం సమాజంలోని ఆలోచనా విధానాన్ని కూడా సినిమా ప్రశ్నిస్తుంది.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

డానియెలా గోగ్గి దర్శకత్వం వహించిన ‘Barreda’లో లూయిస్ మాచిన్ రికార్డో బరెడాగా, కార్లా పీటర్సన్, మెర్సిడెస్ మొరాన్, మైతే లనాటా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1 గంట 45 నిమిషాల నిడివితో రూపొందింది. ‘Barreda’ ఆగస్టు 28, 2026 నుంచి Prime Videoలో అందుబాటులో ఉంది. ఇది తెలుగులో అందుబాటులో లేదు. నిజమైన క్రైమ్ కేసులు, కుటుంబ హత్యలు, కోర్టు డ్రామా, నేరం తర్వాత సమాజం స్పందించే విధానం వంటి అంశాలు ఇష్టపడేవారికి ‘Barreda’ గూస్‌బంప్స్ తెప్పించే డార్క్ ట్రూ క్రైమ్ డ్రామా.

Read Also: జేబులో చిల్లిగవ్వలేదు… కానీ ఆ ఒక్కటీ కావాల్సిందే… నేటితరం యూత్ కు కనెక్టయ్యే కామెడీ కథ

Related News

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

Big Stories

Advertisement
×