Toxic Movie: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతూ కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు యష్ ఒకరు. కే జి ఎఫ్ సినిమా ముందు వరకు కూడా కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనటువంటి యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన కేజిఎఫ్ సినిమా ద్వారా రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. కేజిఎఫ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా తర్వాత కే జి ఎఫ్2 ద్వారా మరోసారి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం యష్ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయన నటించిన టాక్సిక్ సినిమా(Toxic Movie) ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదని చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటం విశేషం. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులపై కన్నడ యష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన నేపథ్యంలో కన్నడ యష్ ఫాన్స్ తెలుగువారికి సినిమాల పట్ల ఏమాత్రం టేస్ట్ లేదు అంటూ విమర్శలు చేయడమే కాకుండా టాలీవుడ్ హీరోల గురించి సోషల్ మీడియా వేదికగా వారిని కించపరుస్తూ మీమ్స్ వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫాన్స్ వర్సెస్ కన్నడ యష్ ఫాన్స్ అనే విధంగా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ప్రేక్షకులు కన్నడ కన్నయ్యలకు తమదైన శైలిలోనే సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.
గతంలో కన్నడ దర్శకులు, కన్నడ నిర్మాతలు నిర్మించిన కే జి ఎఫ్, కాంతారా వంటి సినిమాలను బ్లాక్ బస్టర్ చేసింది తెలుగు ప్రేక్షకులే. ఇలా ఈ సినిమాల సక్సెస్ వెనుక ఉన్నది తెలుగు ప్రేక్షకులు అనే విషయాన్ని మరిచిపోయి, తెలుగు ప్రేక్షకుల గురించి,టాలీవుడ్ హీరోల గురించి ఇలాంటి ట్రోల్స్ చేయడం సరికాదు అంటూ తెలుగు ప్రేక్షకులు తమదైన శైలిలోనే కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా టాక్సిక్ సినిమా విషయంలో కన్నడ ఫాన్స్ వర్సెస్ తెలుగు ఫాన్స్ అనే విధంగా సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతుంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న హీరోలు ప్రస్తుతం పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తున్నారు ఈ విషయాన్ని కూడా కన్నడ ఫ్యాన్స్ గమనించాలి అంటూ తెలుగు సినీ ప్రేక్షకులు కామెంట్లు చేయటం గమనార్హం.
Also Read: అరుదైన ఘనత సాధించిన కాంతార హీరో..ఏకంగా మూడు విభాగాల్లో ఎంపిక!