E-Paper
Advertisement

గుడ్ న్యూస్ చెప్పిన ఈషా రెబ్బా .. వైరల్ అవుతున్న ఫోటోలు!

గుడ్ న్యూస్ చెప్పిన ఈషా రెబ్బా .. వైరల్ అవుతున్న ఫోటోలు!
Advertisement

Eesha Rebba: సాధారణంగా ప్రతి ఒక్కరు తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ వారి కలను నెరవేర్చుకుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సైతం తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వారిలో ఈషా రెబ్బా ఒకరు. అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

నాగేశ్వరి నిలయం..

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలను షేర్ చేసిన ఈషా రెబ్బా.. నాన్న పూర్తిగా తన మనసంతా పెట్టి ఇంటిని కట్టారు. నాన్న అమ్మని ఎంతలా మిస్ అవుతున్నారో నాకు తెలుసు. అమ్మ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు అందుకే ఈ ఇంటికి “నాగేశ్వరి నిలయం”అనే పేరు పెట్టామని ,ఈ పేరు పెట్టడం వల్ల అమ్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుందనే భావన కలుగుతుంది అంటూ ఈషా రెబ్బా తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కాస్త ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సత్యనారాయణ స్వామి వ్రతం..

Advertisement

ఇలా ఈషా రెబ్బా నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులకు కూడా ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ వేడుకలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషా అనంతరం అరవింద సమేత, బందిపోటు, ఆ, వంటి తదితర సినిమాలలో నటించారు. ఇక ఈ ఏడాది దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి ఈమె ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఈషా రెబ్బా కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే గత కొంతకాలంగా ఈషా రెబ్బా లవ్ రూమర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈమె దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని, అతి త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి తరుణ్ భాస్కర్ కూడా పరోక్షంగా పలు సందర్భాలలో ప్రస్తావించిన ఇప్పటివరకు అధికారకంగా ఎక్కడ ప్రకటించలేదు. త్వరలోనే వీరి రిలేషన్ కి సంబంధించిన ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయబోతున్నారని తెలుస్తుంది.

Also Read: తెలుగు ప్రేక్షకులపై విషం కక్కుతున్న కన్నడ కన్నయ్యలు.. తప్పు బ్రో!

Related News

యెష నాగుల పాటకు నేషనల్ అవార్డ్ పక్కా.. కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో!

ఫోక్ స్టార్ కిట్టు పవన్ మూవీ లాంచ్..కెమెరా స్విచ్ ఆన్ చేసి విషెస్ తెలిపిన బిగ్ టీవీ చైర్మన్!

వెంకీమామ ఫాన్స్ కు నిరాశే.. వాయిదాపడిన ఆదర్శ కుటుంబం?

‘ఏషనాగుల’పై ట్రోలింగ్ మొదలు.. ఇదేం ఫోక్ సాంగ్ రా బాబూ!

తెలుగు ప్రేక్షకులపై విషం కక్కుతున్న కన్నడ కన్నయ్యలు.. తప్పు బ్రో!

సాధారణ ప్రయాణికురాలిగా ఆదా శర్మ ట్రైన్ జర్నీ.. జనాలు షాక్!

అరుదైన ఘనత సాధించిన కాంతార హీరో..ఏకంగా మూడు విభాగాల్లో ఎంపిక!

Big Stories

Advertisement
×