E-Paper
Advertisement

యెష నాగుల పాటకు నేషనల్ అవార్డ్ పక్కా.. కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో!

యెష నాగుల పాటకు నేషనల్ అవార్డ్ పక్కా.. కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో!
Advertisement

Yesha Nagula Song: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని(Nani), ఖయాదులోహర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పాటలు గ్లింప్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇదివరకే ఆయా షేర్ అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే.

నానితో మాస్ స్టెప్పులేసిన కీర్తి సురేష్..

ఇకపోతే తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేశారు. యెష నాగుల (Yesha Nagula Song)అంటూ సాగిపోయే ఈ పాట నేడు విడుదల చేయగా సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ పాటలో నాని జోడిగా కీర్తి సురేష్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ పాటకు నేషనల్ అవార్డు (National Award)వస్తుంది అంటూ నాని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పాటకు ఆట సందీప్ మాస్టర్(Sandeep Master) కొరియోగ్రఫీ అందించారు. సమ్మర్ హాలిడేస్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సందీప్ మాస్టర్ యెష నాగుల పాట గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

నేషనల్ అవార్డు పక్కా…

Advertisement

ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన అనంతరం నాని గారు ఈ పాట గురించి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిపారు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలో క్యారవాన్లోకి నన్ను పిలిపించి ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని, ఖచ్చితంగా ఈ పాటకు నేషనల్ అవార్డు వస్తుంది అంటూ నాని కాంప్లిమెంట్ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. నాని ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో సందీప్ మాస్టర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో హుక్ స్టెప్స్ వేయించి మంచి ఫామ్ లోకి వచ్చిన సందీప్ మాస్టర్ ఇప్పుడు యెష నాగుల పాటతో మరోసారి ట్రెండింగ్ లో ఉన్నారు. ఈ పాట సందీప్ మాస్టర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

8 భాషలలో విడుదల…

ఇక ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. నాని తన సినీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత కీలకంగా ఉండబోతుందని చెప్పాలి. ఇప్పటివరకు నాని సినిమాలు కేవలం తెలుగు చిత్రపరిశ్రమకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది. ది ప్యారడైజ్ సినిమా ఆగస్టు 21వ తేదీన విడుదల కావాల్సి ఉండగా మరికొన్ని పనులు ఆలస్యం కావడంతో తిరిగి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేశారు. మరి సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ద్వారా నాని ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: వెంకీమామ ఫాన్స్ కు నిరాశే.. వాయిదాపడిన ఆదర్శ కుటుంబం?

Related News

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా?

Big Stories

Advertisement
×