Thellakagitham Movie: సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఆ సినిమా అదే సమయానికి రావడం అనేది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది. కచ్చితంగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ, కొత్త విడుదల తేదీలను ప్రకటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విడుదల కావాల్సిన ఎన్నో పెద్ద సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరో సినిమా కూడా వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడినట్ల సమాచారం.
ఇలా గాంధీ జయంతిని పురస్కరించుకొని విడుదల కాబోతున్న ఈ సినిమా వాయిదా పడటంతో ఇదే సరైన సమయం అని భావించి ఎన్నో చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఫేమ్ హీరో హర్ష రోషన్ (Harsha Roshan)నటించిన మరో రొమాంటిక్ చిత్రం “తెల్ల కాగితం”(Thellakagitham). ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారకంగా వెల్లడించలేదు. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల కాబోతుందని తెలుస్తోంది.
అక్టోబర్ 2వ తేదీ విడుదల కావాల్సిన ఆదర్శ కుటుంబం వాయిదా పడితే ఖచ్చితంగా అదే తేదీన తెల్ల కాగితం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హర్ష రోషన్ నక్షత్ర హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రమేష్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కృష్ణ కొమ్మలపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి అంచనాలను పెంచేసింది .
ఈ సినిమా నుంచి ఇదివరకే చిలక అంటూ సాగిపోయే పస్ట్ సింగిల్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. హర్ష రోషన్ హీరోగా కోర్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ సందర్భంగా బ్యాండ్ మేళం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న విధంగా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. మరి త్వరలోనే విడుదల కాబోతున్న తెల్ల కాగితం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: యెష నాగుల పాటకు నేషనల్ అవార్డ్ పక్కా.. కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో!