E-Paper
Advertisement

‘ఏషనాగుల’పై ట్రోలింగ్ మొదలు.. ఇదేం ఫోక్ సాంగ్ రా బాబూ!

‘ఏషనాగుల’పై ట్రోలింగ్ మొదలు.. ఇదేం ఫోక్ సాంగ్ రా బాబూ!
Advertisement

Eshanagula song:దసరా ..నాని, శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకి పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.దీంతో ఇదే కాంబోలో వస్తున్న ప్యారడైజ్ సినిమాపై అంచనాలు స్కై లెవెల్ కి వెళ్లిపోయాయ్.ఇక మొదటగా వచ్చిన ఆయాషేర్ పాటైతే రికార్డులని మడతెట్టేస్తుంది.ఇక ఈ మధ్య వచ్చిన గ్లిమ్ప్స్ కూడా మంచి టాక్ నే మూటగట్టుకుంది.ముఖ్యంగా జడల్ పాత్రలో నాని ఇచ్చిన ఫెర్ఫామెన్స్ ని చూసి థియేటర్లు తగలబడిపోవడం పక్కా..అని ఫిక్స్ అయ్యారు నాని ఫ్యాన్స్.

నాని చేతుల మీదుగా రెండో సింగిల్

ఇక ఇదిలా ఉంటె తాజాగా డల్లాస్ లో జరిగిన అనిరుద్ లైవ్ కాన్సర్ట్ లో సినిమా నుండి ఎషనాగుల అంటూ రెండో సింగిల్ ని నాని చేతుల మీదుగా వదిలారు మేకర్స్.ఇక పాటలోనాని మాసీ లుక్. కీర్తి సురేష్ స్టెప్పులు, వందలమంది డాన్సర్స్..మొత్తంగా పాటని సందీప్ అండ్ జ్యోతి మాస్టర్స్ కలిసి ఒక రేంజ్ కొరియోగ్రఫీ చేశారని చూస్తేనే అర్థం అవుతుంది.

తెలంగాణా ఫోక్ టచ్ మిస్

Advertisement

అంతవరకు బాగానే ఉంది కాని ‘ఏషనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాలా.. మనం ఊగుదామే బాలా’ అంటూ వచ్చిన ఈ పాటలో తెలంగాణా ఫోక్ టచ్ మిస్ అయిందన్న కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్‌లోప్రభా బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డిలు తెలంగాణా నేటివిటీని తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ,ఇప్పటి యూత్ కి కనెక్ట్ కాదనే ఉద్దేశంలో పాట టెంపోని మార్చేసి ఆ తెలంగాణా మట్టిలో ఉండే వాసనని సాంగ్ లో మిస్ చేశారని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఒరిజినల్ నే దింపితే ఇంకా బాగుండు

ఇక ఈ పాట ఇలా రిలీజ్ అయిందో లేదో ..ఒక వర్గం పాట అదిరిపోయింది, కీర్తి సురేష్ స్టెప్పులు ఇరగదీసింది, పాటకి సాలిడ్ బడ్జెట్ నే ఖర్చు పెట్టారు అంటూ ఊదరగొడుతుంటే,మరో వర్గం తెలంగాణ పటా అంటే ఇది కాదని, తెలంగాణ పదాలు రాసేసి బీట్ మారిస్తే అది ఫోక్ సాంగ్ అయిపోతుందా అంటూ ఏకిపారేస్తున్నారు.ఇక మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అనిరుద్ కి ఫోక్ లో ఉండే స్వీట్ నెస్ తెలీదని ,ఇలా కంపోజ్ చేయడం కన్నా గతంలో తెలంగాణా అంతటా వినబడ్డ ఒరిజినల్ నే దింపితే ఇంకా బాగుండేదని వాదిస్తున్నారు.

Advertisement

also read :టాక్సిక్ మేకింగ్ వీడియో చూశారా? యష్ కష్టం చూస్తే మైండ్ బ్లాంక్

ఎదో మిస్ అయిందే అన్న ఫీల్

గతంలో ఇలాగే నీలపురి , సారంగధరియవంటి చాలా జానపదాలు సినిమాలలో వాడినప్పటికీ అవన్నీ ఒరిజినల్ ట్యూన్ ఆధారంగానే రావడం సూపర్ హిట్ అవడం మనకి తెల్సిందే.ఎన్నో ఏళ్లుగా ఆ పాటలు మన పెళ్ళిలలో, పండుగలలో, ఫంక్షన్స్ లలో విచ్చలవిడిగా వినేసి ఉంటాము.కాబట్టి మన మైండ్ ఆ లిరిక్స్ ని వేరే ట్యూన్ కి అంత ఈజీగా ఒప్పుకోదు.ఎదో మిస్ అయిందే అన్న ఫీల్ కలుగుతుంది.ఇదిగో అచ్చం అలాంటి ఫీలే ఇపుడు ఎషనాగుల కట్ట మీద పాటకి కలుగుతుంది.

also read :‘టాక్సిక్’కు టైమ్ బాగోలేదా..OTT రైట్స్‌పై కొత్త లెక్కలు?

ఆడియన్స్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో !

నిజానికి అనిరుద్ తన స్టైల్ లో సాలిడ్ హై వోల్టేజ్ మాస్ నంబర్ గా మార్చేందుకు ప్రయత్నించాడు.బాగానే ఉంది కాని తెలంగాణా నేటివిటిలో ఉండే మ్యాజిక్కే మిస్ అయ్యింది.అది దర్శకుడు, లిరిక్ రైటర్ కలిసి ఒరిజినల్ ఫీల్ మిస్ కాకుండా చేయాల్సింది.

మొత్తంగా ప్రొడక్షన్ వైజ్ గా, కొరియోగ్రఫీ వైజ్ గా, పాట అదరగొట్టినప్పటికీ పాట కాస్త ఒరిజినల్ టచ్ ని మిస్ కాకుండా ఉంటె మరింత బాగుండేది అంటున్నారు సోషల్ మీడియా జనాలు. సెప్టెంబర్ 24న థియేటర్ లలోకి ప్యారడైజ్ సినిమా రానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్.చూడాలి మరి ఈ పాటని సినిమాలో చూసి ఆడియన్స్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో !

 

 

Tags

Related News

వెంకీమామ ఫాన్స్ కు నిరాశే.. వాయిదాపడిన ఆదర్శ కుటుంబం?

గుడ్ న్యూస్ చెప్పిన ఈషా రెబ్బా .. వైరల్ అవుతున్న ఫోటోలు!

తెలుగు ప్రేక్షకులపై విషం కక్కుతున్న కన్నడ కన్నయ్యలు.. తప్పు బ్రో!

సాధారణ ప్రయాణికురాలిగా ఆదా శర్మ ట్రైన్ జర్నీ.. జనాలు షాక్!

అరుదైన ఘనత సాధించిన కాంతార హీరో..ఏకంగా మూడు విభాగాల్లో ఎంపిక!

టాక్సిక్ మేకింగ్ వీడియో చూశారా? యష్ కష్టం చూస్తే మైండ్ బ్లాంక్

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న తాప్సీ.. డైరెక్టర్ ఎవరంటే?

Big Stories

Advertisement
×