BigTV English

Venkatesh: వెంకటేష్ ఇంట్లో విషాదం… 12 సంవత్సరాలుగా కలిసి ఉన్న స్నేహితుడు దూరం

Venkatesh: వెంకటేష్ ఇంట్లో విషాదం… 12 సంవత్సరాలుగా కలిసి ఉన్న స్నేహితుడు దూరం

Venkatesh: ఈ సృష్టిలో మనుషులతో పాటు చాలా రకాల జంతువులు ఉన్నాయి. అయితే జంతువులన్నిటిలో కంటే కుక్కలను కొంతమంది తమ ఇంట్లో మనుషుల్లా భావిస్తుంటారు. చాలామంది సెలబ్రిటీస్ కి కుక్కలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన లైఫ్ టైంలో దాదాపు 30కు పైగా కుక్కలను పెంచారు. ఒక తరుణంలో కుక్కలకు తాను తిండి పెట్టలేకపోతున్నానని వేరే వాళ్ళకి అమ్మేశారు. అలానే పూరి ఇంట్లో కుక్క చనిపోయినప్పుడు కూడా దాని గురించి రాస్తూ పోస్ట్ పెట్టారు.


కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం కుక్కలకు మాత్రమే ఉంటుంది. ఒక మనిషిని తిట్టడానికి విశ్వాసం అనే పదాన్ని వాడితే దానిలో కుక్కను కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ఇంట్లో 12 సంవత్సరాలుగా ఉంటున్న కుక్క నేడు మరణించింది. దీనిపై విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.

12 సంవత్సరాల స్నేహితుడు దూరం 


విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా… 12 సంవత్సరాల నుంచి నువ్వు మాకు ఎంతో ప్రేమను చూపించావు. అలానే నీతో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వు మా సన్ సైన్. అలాంటి నీకు ఈరోజు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు వెంకటేష్. అలానే గతంలో ఆ కుక్కతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేశారు. ఆ కుక్క పేరు గూగుల్.

మల్లీశ్వరి సీన్ గుర్తొస్తుంది 

త్రివిక్రమ్ రాసిన మల్లీశ్వరి (Malleswari) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ సినిమాలో కుక్కకు సంబంధించిన సీను కూడా ఒకటి ఉంటుంది. ఆ సీన్ ఇప్పుడు చూసినా కూడా మంచి ఫన్ క్రియేట్ అవుతుంది. అయితే ఒక సీన్ లో వెంకటేష్ వలన ఆ కుక్క చనిపోతుంది. అయితే ఆ చనిపోయిన కుక్క దగ్గర విపరీతమైన కామెడీ కూడా ఉంటుంది. ప్రస్తుతం అందరికీ అదే సీన్ గుర్తుకు వస్తుంది. ఇక ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం కూడా కొన్ని రోజుల క్రితం జరిగింది. మరోవైపు ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రచయితగా వెంకటేష్ కి మంచి సక్సెస్ అందించాడు త్రివిక్రమ్. ఇప్పుడు దర్శకుడుగా ఏ రేంజ్ హిట్ ఇస్తారో అనేది వేచి చూడాలి.

Also Read: Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Related News

Tollywood Heros: స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు.. ఏ హీరో ఏ సినిమా అంటే..?

Teja Sajja: అన్నీ నేనే చేశాను. నాకు బాడీ డబుల్ ఎవరూ లేరు

OG Trailer Update: ఓజీ ట్రైలర్ ఎప్పుడంటే? మరీ అంత లేటా?

NTRNeel : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని లీకులే, ఈ కష్టం శత్రువుకి కూడా రాకూడదు

Mirai Film: మిరాయ్ సినిమాలో రాముడిగా  స్టార్ హీరో… థియేటర్లు తగలబడి పోవాల్సిందే?

Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్

Big Stories

×