Singeetam srinivas Rao Death: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న దర్శకుడు సింగీతం శ్రీనివాస్(Singeetam srinivas Rao) కన్నుమూశారు. 94 సంవత్సరాల వయసులో ఈయన వయోభారంతో బాధపడుతూ చెన్నైలోనే కావేరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇలా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఇక ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా వెల్లడించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా యావత్ భారత సినీ ప్రపంచం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ విధంగా డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఈయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఎంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇలా తన 94వ సంవత్సరంలో కూడా ఈయన సినిమాకు దర్శకత్వం వహించి సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై యువ దర్శకుడు నాగ్ అశ్విన్ సమర్పణలో సింగీతం శ్రీనివాస్ “సింగ్ గీతం”(Sing Geetham)అనే సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇలా తన 94వ ఏట కూడా ఈయన దర్శకుడిగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున ప్రశంసలను సొంతం చేసుకున్నారు. ఇలా తన చివరి క్షణం వరకు సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీకి సేవలు అందించిన ఈ దిగ్గజ దర్శకుడు ఇక లేరనే వార్త చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.
సింగీతం శ్రీనివాస్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో సుమారు 60 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. టాకీ కాలంలో మాటలు లేని నిశ్శబ్ద హాస్య చిత్రం పుష్పకం విమానంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగీతం శ్రీనివాస్ అనంతరం సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఆదిత్య 369 వంటి అద్భుతమైన సినిమాని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. గ్రాఫిక్స్ కూడ లేని కాలంలోనే ఈయన అద్భుతమైన టెక్నాలజీతో ఎన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న సింగీతం శ్రీనివాస్ రావు మరణించారనే విషయం తెలిసిన అభిమానులు సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈయన మరణం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
Also Read: ఇలా తయారయ్యారేంట్రా? ‘చుట్టమల్లే’ సాంగ్ పై విజయ్ దేవరకొండ ఫైర్