Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా చుట్టమల్లే పాట వివాదం పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), జాన్వి కపూర్(Janhvi Kapoor) హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలోని చుట్ట మల్లె (Chuttamalle Song)పాట ఎంతటి ఆదరణ సొంతం చేసుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ పాటను కొంతమంది ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అభ్యంతరకరంగా వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇలా ఈ పాటను ఏఐ మార్ఫింగ్ చేయడం పట్ల ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా ఏఐ మార్ఫింగ్ ద్వారా అసభ్యకరమైన వీడియోని పోస్ట్ చేయడం అనేది సిగ్గుమాలిన చర్య.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల ఉపేక్షించేది లేదని కచ్చితంగా వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాము అంటూ తనదైన శైలిలోనే ఎన్టీఆర్ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ పై విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా స్పందిస్తూ ఎన్టీఆర్ కి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయడమే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల అలాగే ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ చేసిన పోస్ట్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “మనం పూర్తిగా నీచమైన స్థాయికి దిగజారి పోయాము.. ఇలా తయారయ్యారేంటి.. దీనికి ఎవరైతే బాధ్యత వహించారో వారిని ఎలాంటి పరిస్థితులలో కూడా వదిలి పెట్టకూడదు వారికి కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా సరైన గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకోవాలని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు. మనం అందరం ఒకరి పట్ల మరొకరు ఇంత సున్నితత్వం కోల్పోయింది ఎప్పుడు.. ఎలాంటి పెంపకం కొనసాగుతోంది? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం? ఒకరినొకరు అవమానించుకోవడంలో ఆనందాన్ని వెతుకునే స్థాయికి ఎలా వచ్చాం అంటూ విజయ్ దేవరకొండ మండిపడ్డారు.
We have stooped to the levels of absolute lowlife.
Whoever is responsible for this should not be spared. They must face the harshest possible legal consequences and be made an example of. We must not let this go.
when did we became so insensitive to each other. What kind of… https://t.co/eVP6zC9DTG
— Vijay Deverakonda (@TheDeverakonda) October 3, 2026
ఈ ప్రపంచం మొత్తం ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయో జీవనోపాధి కోల్పోతామని భయపడుతున్న సమయంలో కొంతమంది మూర్ఖులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలాంటి అర్థం లేని నీచమైన పనులు చేస్తున్నారు. ఇది డిజిటల్ రూపంలో జరిగే ఒక లైంగిక దాడితో సమానమని ఇలాంటి చర్యలను చట్టం కూడా తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నిలబడుతున్న వారికి పూర్తిస్థాయిలో నా మద్దతు తెలియజేస్తున్నాను అంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా చుట్టమల్లే సాంగ్ వివాదంపై ఘాటుగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Also Read; ‘వారణాసి’ రుద్ర పాత్ర పై రాజమౌళి కామెంట్… ఇది అసలు ఊహించలేదంటూ!